LIC: అదిరిపోయే ఎల్‌ఐసీ పాలసీ.. రూ. 55 కడితే.. రూ. 13 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే.!

LIC New Jeevan Anand Policy: మధ్యతరగతి ప్రజలకు ఎలప్పుడూ అందుబాటులో ఉండే సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్‌ఐసీ). తక్కువ పెట్టుబడితో..

LIC: అదిరిపోయే ఎల్‌ఐసీ పాలసీ.. రూ. 55 కడితే.. రూ. 13 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే.!
Follow us

|

Updated on: Feb 15, 2021 | 9:49 PM

LIC New Jeevan Anand Policy: మధ్యతరగతి ప్రజలకు ఎలప్పుడూ అందుబాటులో ఉండే సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్‌ఐసీ). తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందటం కోసం పెట్టుబడిదారులకు ఎప్పటికప్పుడు కొత్త పాలసీలను ప్రవేశపెడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఎల్ఐసీ అమలులోకి తీసుకొచ్చిన పాలసీలలో బాగా పేరొందినది జీవన్ ఆనంద్ పాలసీ. ఈ పాలసీలో చేసిన వారికి గడువు ముగిసిన తర్వాత కూడా బీమా కొనసాగుతుంది. ఇక కొన్ని నెలల క్రితం ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీని ప్రవేశపెట్టింది.

న్యూజీవన్ ఆనంద్ పాలసీ వివరాలు..

అర్హత – 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్లు

బీమా – కనిష్టం – లక్ష

గరిష్టం – పరిమితి లేదు

కాలపరిమితి – 15 నుంచి 35 ఏళ్లు

మీరు ఈ పాలసీని రూ. 5 లక్షల మొత్తంలో 25 ఏళ్ల కాలపరిమితితో తీసుకున్నట్లయితే.. నెలకు రూ. 1650(అంటే రోజుకు రూ. 55) ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మూడు నెలలకు అయితే రూ. 5000, అదే ఆరు నెలలు అయితే రూ. 10 వేలు చెల్లించాలి. ఇదిలా ఉంటే ఒకవేళ పాలసీదారుడు గడువులోగా మరణించినట్లయితే నామినీ రూ. 5 లక్షలు లభిస్తాయి. అదే మొత్తం 25 ఏళ్ల గడువు కాలం పూర్తయితే ఎస్ఐ రూపంలో రూ. 5 లక్షలు, బోనస్ కింద రూ. 5.75 లక్షలు, అదనపు బోనస్ కింద రూ. 2.25 లక్షలు వెరిసి మొత్తం రూ. 13 లక్షలు లభిస్తాయి.