FD Interest: పెరిగిన FD వడ్డీ రేట్లు.. SBI, PNB, HDFC, యాక్సిస్ బ్యాంకుల్లో ఎలా ఉన్నాయంటే..
పెరిగిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB), HDFC, యాక్సిస్ బ్యాంకు తదితర బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగాయి...
పెరిగిన ద్రవ్యోల్బణం నేపథ్యంలో వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB), HDFC, యాక్సిస్ బ్యాంకు తదితర బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగాయి. యాక్సిస్ బ్యాంకు ఇటీవలే రూ.2 కోట్లకు పైన ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. ఇది మార్చి 17వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వివిధ బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు చూద్దాం. యాక్సిస్ బ్యాంకులో 7 రోజుల నుంచి 14 రోజుల కాలపరిమితి, 15 రోజుల నుండి 29 రోజుల కాలపరిమితిపై FD డిపాజిట్ వడ్డీ రేటు 2.5 శాతంగా ఉంది. 30 రోజుల నుండి 45 రోజులు, 46 రోజుల నుండి 60 రోజులు, 61 రోజుల నుండి 90 రోజుల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3 శాతం ఇస్తున్నారు.
91 రోజుల నుండి 120 రోజుల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.5 శాతం వర్తిస్తుంది. 6 నెలల 1 రోజు నుండి 9 నెలలు, 9 నెలల ఒకరోజు నుండి 1 ఏడాది వరకు కాలపరిమితిపై వడ్డీ రేటు 4.4 శాతంగా ఉంది. ఏడాది నుంచి మూడేళ్ల కాలపరిమితి FDపై 5.10 శాతం వడ్డీ రేటు ఉంది. మూడేళ్ల ఒకరోజు నుంచి అయిదేళ్లు కాలపరిమితిపై వడ్డీ రేటు 5.45 శాతం ఇస్తున్నారు. అయిదేళ్ల 1 రోజు నుండి 10 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.75 శాతంగా ఉంది.
SBI వడ్డీ రేటు
7 రోజుల నుంచి 14 రోజుల కాలపరిమితి, 15 రోజుల నుంచి 29 రోజులు, 30 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితిపై FD డిపాజిట్‌పై వడ్డీ రేటు 2.9 శాతంగా ఉంది. 46 రోజుల నుంచి 60 రోజులు, 61 రోజుల నుంచి 90 రోజులు, 91 రోజుల నుండి 120 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.90 శాతం ఇస్తున్నారు. ఆరు నెలల 1 రోజు నుంచి 9 నెలలు, 9 నెలల ఒకరోజు నుంచి ఏడాది, ఏడాది నుంచి మూడేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 4.4 శాతంగా ఉంది. రెండేళ్ల ఒకరోజు నుంచి 3 ఏళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.20 శాతం ఇస్తున్నారు. మూడేళ్ల 1 రోజు నుండి అయిదేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5.45 శాతంగా ఉంది.
PNB వడ్డీ రేటు
7 రోజుల నుంచి 14 రోజులు, 15 రోజుల నుంచి 29 రోజులు, 30 రోజుల నుంచి 45 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 2.90 శాతం ఇస్తున్నారు. 46 రోజుల నుంచి 90 రోజుల కాలపరిమితిపై వడ్డీ రేటు 3.25 శాతంగా ఉంది. 91 రోజుల నుంచి 179 రోజుల కాలపరిమతిపై 3.80 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. 180 రోజుల నుండి 270 రోజులు, 271 రోజుల నుండి 1 ఏడాది లోపు కాలపరిమతిపై వడ్డీ రేటు 4.4 శాతం ఇస్తు్న్నారు. ఏడాది ఒకరోజు నుంచి రెండేళ్ల కాలపరిమితిపై వడ్డీ రేటు 5 శాతంగా ఉంది.
HDFC బ్యాంకు వడ్డీరేటు 7 రోజుల నుండి 14 రోజుల కాలపరిమితి, 15 రోజుల నుంచి 29 రోజుల కాలపరిమితిపై FD డిపాజిట్ వడ్డీ రేటు 2.5 శాతం ఇస్తున్నారు. 30 రోజుల నుంచి 45 రోజులు, 46 రోజుల నుంచి 60 రోజులు, 61 రోజుల నుంచి 90 రోజుల కాలపరిమితిపై ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3 శాతం వర్తిస్తుంది. 91 రోజుల నుంచి 120 రోజుల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు 3.5 శాతంగా ఉంది.
Read Also.. FD Schemes: ఈ స్కీమ్‌లో మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే మార్చి 31 వరకే అవకాశం..!