Marigold Flower Business: అదిరిపోయే బిజినెస్ ఐడియా.. బంతిపూల సాగుతో లక్షల్లో ఆదాయం..

కరోనా దేశ వ్యాప్తంగా ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది.

Marigold Flower Business: అదిరిపోయే బిజినెస్ ఐడియా.. బంతిపూల సాగుతో లక్షల్లో ఆదాయం..
Marigold Flowers
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 26, 2021 | 5:37 PM

కరోనా దేశ వ్యాప్తంగా ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపించింది. సామాన్యుల నుంచి వ్యాపారవేత్తల వరకు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తీసింది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది. దీంతో పట్టణంలో ఉన్నవారు పల్లెబాట పట్టారు. అలాగే చిరు వ్యాపారుల సంఖ్య కూడా పెరిగింది. ఈ కరోనా కష్టాల నుంచి గట్టెక్కెందుకు ఎంతో మంది అర్హతకు సంబంధం లేకుండా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే గ్రామాల్లో భూమి ఉన్నవారికి సూపర్ ఆప్షన్ అందుబాటులో ఉంది. పూలను సాగుచేసి లక్షల్లో ఆదాయం సంపాదించవచ్చు. అది కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువగా లాభాన్ని ఆర్జించవచ్చు. ఇక ఈ వర్షాకాలంలో పూలను సాగుచేయడం కూడా పెద్ద కష్టమేమి కాదు.. ముఖ్యంగా బంతి పూల సాగు వలన తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు. మరి ఎలాగో తెలుసుకుందామా.

ఇంట్లో జరిగే శుభకార్యాలకు, పండుగలకు, వేడుకలకు ఎక్కువగా మారిగోల్డ్ ఫ్లవర్ (బంతి పూలు)ను ఉపయోగిస్తుంటారు. సీజన్‏తో పనిలేకుండా ఈ పూలను విరివిరిగా వాడేస్తుంటారు. అంతేకాదండోయ్.. ఈ పూలలో విటమిన్ సీ కూడా ఉంటుందట. అందుకే వీటిని మెడిసిన్స్ తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. అయితే ఈ పూలను సాగు చేయడం వలన ప్రతి సంవత్సరం ఏకంగా రూ. 15 లక్షల వరకు లాభం పొందొచ్చు. ఇందుకు ఒక హెక్టార్ ఉంటే సరిపోతుంది. బంతిపూలను సాగు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. బంతిపూల జ్యూస్‏ను క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులను నయం చేయడంలోనూ ఉపయోగిస్తారు. అలాగే అగర్ బత్తుల తయారీలోనూ ఉపయోగిస్తుంటారు. అందుకే వీటికి మార్కెట్‏లో ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. మీకు ఒక ఎకరం పొలం ఉంటే.. ప్రతి ఏడాది రూ. 5-6 లక్షల వరకు సంపాదించవచ్చు. ప్రతి వారం మూడు టన్నుల వరకు పూలు కోయొచ్చు. మార్కెట్‏లో కేజీ పూల ధర రూ. 70 నుంచి రూ. 100 వరకు ఉంటుంది. అంటే ప్రతి వారం రూ. 20 వేలకు లాభం ఉంటుంది. వీటిని సంవత్సరానికి మూడు సార్లు సాగు చేయవచ్చు. అయితే ఈ పంటకు దాదాపు లక్ష వరకు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఈ మూలు 40 రోజులకు పూస్తాయి. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‏లో వీటికి డిమాంట్ అధికంగా ఉంటుంది.

Also Read: YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో దూకుడు పెంచిన సీబీఐ.. కీలక అనుమాతుడిని విచారించిన అధికారులు..

Currency Printing: కరెన్సీ నోట్లు ముద్రించనున్నారా? లోక్‌సభలో క్లారిటీ ఇచ్చిన మంత్రి నిర్మలా సీతారామన్