AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ఆధార్ ఉన్న వారికి కేంద్రం ఉచితంగా తులం బంగారం ఇస్తుందా? ఇది నిజమేనా?

Fact Check: సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియో వేగంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగంలో సభ్యులు లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక తులం (10 గ్రాములు) బంగారాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొంటున్నారు. అంతేకాదు, ఈ పథకాన్ని ప్రధానమంత్రి..

Fact Check: ఆధార్ ఉన్న వారికి కేంద్రం ఉచితంగా తులం బంగారం ఇస్తుందా? ఇది నిజమేనా?
Gold
Subhash Goud
|

Updated on: Jan 05, 2026 | 6:41 PM

Share

Fact Check: ప్రభుత్వ ఉద్యోగంలో సభ్యులు ఎవరూ లేని కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 10 గ్రాముల బంగారాన్ని ఉచితంగా ఇస్తుందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు వైరల్‌ అవుతోఎంది. ‘sanjay_annu_sahu’ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్‌ అవుతోంది. ఆధార్ కార్డుల ద్వారా బంగారం పంపిణీ చేయనున్నట్లు ఇది పేర్కొంది. కానీ ఇది నిజమేనా? దీనిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) క్లారిటీ ఇచ్చింది. ఈ విషయాన్ని పరిశోధించి వాస్తవాన్ని వెల్లడించింది.

PIB ఫ్యాక్ట్ చెక్ అధికారిక X ఖాతాలో పోస్ట్ చేసిన ట్వీట్ ఈ వాదన పూర్తిగా అబద్ధమని స్పష్టంగా పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగాన్ని చూపించే వీడియో AI సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సృష్టించారని, దానిని దురుద్దేశపూరిత ప్రయోజనాల కోసం ప్రసారం చేస్తున్నారని ట్వీట్ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అలాంటి ప్రణాళికను ప్రకటించలేదని పీఐబీ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Interesting Facts: మనం ప్రతిరోజూ వాడే 5 వస్తువుల వెనుక ఉన్న ఆసక్తికరమైన నిజాలు ఇవే..!

సోషల్ మీడియాలో వ్యాపించే ఇటువంటి నకిలీ, సంచలనాత్మక వాదనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఏదైనా ప్రభుత్వ పథకం గురించిన సమాచారాన్ని అధికారిక సైట్ల నుండి మాత్రమే ధృవీకరించాలని, ధృవీకరించని కంటెంట్‌ను పంచుకోకుండా ఉండాలని PIB ప్రజలకు సలహా ఇస్తుంది.

ఇది కూడా చదవండి: Indian Currency Printing: ఆర్‌బిఐ అపరిమితంగా నోట్లను ముద్రిస్తే ఏమవుతుంది? కరెన్సీ ముద్రణను ఎవరు నిర్ణయిస్తారు?

ప్రభుత్వానికి సంబంధించిన ఏవైనా వార్తలపై మీకు సందేహాలు ఉంటే, దాని నిజాన్ని తెలుసుకోవడానికి మీరు PIB ఫ్యాక్ట్ చెక్ సహాయం తీసుకోవచ్చు. ఎవరైనా తప్పుదారి పట్టించే వార్తల స్క్రీన్‌షాట్, ట్వీట్, ఫేస్‌బుక్ పోస్ట్ లేదా సంబంధిత URLని నేరుగా PIB ఫ్యాక్ట్ చెక్‌కు పంపవచ్చు. దీని కోసం WhatsApp నంబర్ 8799711259 లేదా factcheck@pib.gov.inకు ఇమెయిల్ కూడా ఉపయోగించవచ్చు. PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ 2019 నుండి చురుకుగా ఉంది. ఇప్పటివరకు వేలాది నకిలీ వార్తలను తొలగించింది. ప్రభుత్వ పథకాలు, విధానాలకు సంబంధించిన తప్పుడు, తప్పుదారి పట్టించే సమాచారాన్ని అరికట్టడం దీని ప్రధాన లక్ష్యం.

ఇది కూడా చదవండి: Indian Currency Printing: ఆర్‌బిఐ అపరిమితంగా నోట్లను ముద్రిస్తే ఏమవుతుంది? కరెన్సీ ముద్రణను ఎవరు నిర్ణయిస్తారు?

ఇది కూడా చదవండి: Post Office: పోస్టాఫీస్‌లో బెస్ట్‌ స్కీమ్‌.. రోజుకు రూ.400 ఆదా చేస్తే పదేళ్లలో 20 లక్షలు!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బీరు తాగితే కిడ్నీలో రాళ్ళు మంచులా కరిగిపోతాయా..? అసలు నిజం ఇదే..
బీరు తాగితే కిడ్నీలో రాళ్ళు మంచులా కరిగిపోతాయా..? అసలు నిజం ఇదే..
మకర సంక్రాంతి వచ్చేస్తోంది.. ఈ రెండు దానం చేస్తే కోటీశ్వరులే..
మకర సంక్రాంతి వచ్చేస్తోంది.. ఈ రెండు దానం చేస్తే కోటీశ్వరులే..
సంక్రాంతికి లక్కు కలిసొచ్చే రాశులివే.. అదృష్టంతో అడుగు అడుగునా లా
సంక్రాంతికి లక్కు కలిసొచ్చే రాశులివే.. అదృష్టంతో అడుగు అడుగునా లా
మన్మథుడి హీరోయిన్ కూతురు ఇంత అందంగా ఉందా.. ?
మన్మథుడి హీరోయిన్ కూతురు ఇంత అందంగా ఉందా.. ?
కాశ్మీర్ లోయలో కనువిందు చేస్తున్న అందాలు.. రికార్డు స్థాయిలో
కాశ్మీర్ లోయలో కనువిందు చేస్తున్న అందాలు.. రికార్డు స్థాయిలో
రాత్రి పడుకునే ముందు రెండు ఎండు ఖర్జూరాలు నానబెట్టి.. ఉదయాన్నే..
రాత్రి పడుకునే ముందు రెండు ఎండు ఖర్జూరాలు నానబెట్టి.. ఉదయాన్నే..
2026లో బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడం లాభదాయకమేనా?
2026లో బంగారం, వెండిపై పెట్టుబడి పెట్టడం లాభదాయకమేనా?
1996 సీన్ రిపీట్.. జైషా బడితపూజతో గజగజ వణికిపోతున్న బంగ్లాదేశ్?
1996 సీన్ రిపీట్.. జైషా బడితపూజతో గజగజ వణికిపోతున్న బంగ్లాదేశ్?
వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్.. జస్ట్ 60 సెకన్లలోనే..
వాట్సప్ ద్వారా ఆధార్ డౌన్‌లోడ్.. జస్ట్ 60 సెకన్లలోనే..
ఛార్జ్ షీట్ స్వరూపం మార్చిన లేడీ పోలీస్‌..! ప్రజలకు మరింత చేరువగా
ఛార్జ్ షీట్ స్వరూపం మార్చిన లేడీ పోలీస్‌..! ప్రజలకు మరింత చేరువగా