Swiggy: స్విగ్గీకు మాజీ ఉద్యోగి ఝలక్‌.. రూ.33 కోట్లు హాంఫట్

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ అయిన స్విగ్గీ కంపెనీకు మాజీ ఉద్యోగి ఝలక్‌ ఇచ్చాడు. ఏకంగా కంపెనీను రూ.33 కోట్ల మేర మోసం చేశాడు. సాధారణంగా ఏ కంపెనీ అయినా వార్షిక నివేదికను పరిశీలిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో స్విగ్గీ కూడా ఇటీవల తన వార్షిక నివేదికను పరిశీలించింది. ఈ పరిశీలనలో స్విగ్గీ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి రూ.33 కోట్లు మోసం చేశాడని గుర్తించింది.

Swiggy: స్విగ్గీకు మాజీ ఉద్యోగి ఝలక్‌.. రూ.33 కోట్లు హాంఫట్
Swiggy Delivery Boy
Follow us
Srinu

|

Updated on: Sep 06, 2024 | 8:17 PM

ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్‌ అయిన స్విగ్గీ కంపెనీకు మాజీ ఉద్యోగి ఝలక్‌ ఇచ్చాడు. ఏకంగా కంపెనీను రూ.33 కోట్ల మేర మోసం చేశాడు. సాధారణంగా ఏ కంపెనీ అయినా వార్షిక నివేదికను పరిశీలిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో స్విగ్గీ కూడా ఇటీవల తన వార్షిక నివేదికను పరిశీలించింది. ఈ పరిశీలనలో స్విగ్గీ సంస్థకు చెందిన మాజీ ఉద్యోగి రూ.33 కోట్లు మోసం చేశాడని గుర్తించింది. ఈ మోసంపై వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అలాగే ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి ఓ బృందాన్ని కూడా నియమించింది. ఈ నేపథ్యంలో స్విగ్గీను ఆ ఉద్యోగి ఎలా మోసం చేశాడు? అనే వివరాలను ఓ సారి తెలుసుకుందాం.

ఇటీవల వెల్లడైన కొన్ని నివేదికల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి వార్షిక నివేదికను స్విగ్గీ ప్రతినిధులు పరిశీలించారు. ఈ పరిశీలనలో స్విగ్గీ అనుబంధ సంస్థలో ఒక మాజీ జూనియర్ ఉద్యోగి రూ.326.76 మిలియన్లను స్వాహా చేశాడని గుర్తించింది. ఉద్యోగి దెబ్బకు కంగుతిన్న స్విగ్గీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కంపెనీలో అంతర్గత విచారణ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 26న కంపెనీ తన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఇలా చేయడం ద్వారా రూ. 3,750 కోట్లు నుంచి రూ. 6,664 కోట్ల వరకు సేకరించాలని స్విగ్గీ లక్ష్యంగా పెట్టుకుంది. 

2024 ఆర్థిక సంవత్సరంలో స్విగ్గీ మొత్తం వ్యయం రూ. 13,947 కోట్లకు చేరుకుంది. ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా నష్టాలను రూ.4,179 కోట్ల నుంచి రూ.2,350 కోట్లకు 44 శాతం తగ్గించుకోగలిగింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 8 శాతం తగ్గింది. ప్రధానంగా ప్రమోషన్, మార్కెటింగ్‌పై ఖర్చు తగ్గించడం వల్ల 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,501 కోట్ల నుండి 2024 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,851 కోట్లకు తగ్గింది. ఆర్థిక మెరుగుదలలు ఉన్నప్పటికీ స్విగీ పోటీదారునిగాఉన్న జొమాటోతో పోలిస్తే ఇంకా వెనుకబడే ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో రెండు కంపెనీలకు స్థూల ఆర్డర్ విలువ  సుమారుగా రూ. 56,924 కోట్లుగా ఉంది. ఫుడ్ డెలివరీ విభాగంలో స్విగ్గి 43 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండగా, జొమాటో 57 శాతం వాటాతో ముందుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..