EV’s Battery Care Tips: మీకు ఎలక్ట్రిక్ టూ వీలర్ ఉందా.. అయితే ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోండి..

ఎలక్ట్రిక్ వాహనాలలో బ్యాటరీ చాలా ముఖ్యమైనది. మరోవైపు, కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే.. సురక్షితమైన పద్ధతిలో మెరుగైన అవుట్‌పుట్ తీసుకోవచ్చు.

EV's Battery Care Tips: మీకు ఎలక్ట్రిక్ టూ వీలర్ ఉందా.. అయితే ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోండి..
Electric Two Wheelers
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 27, 2023 | 6:56 AM

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారతదేశంలో కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. చాలా మంది దాని బ్యాటరీ బ్యాకప్, పవర్ రేంజ్ గురించి మనలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు.  ఎందుకంటే ఎలక్ట్రిక్ స్కూటర్‌లో బ్యాటరీ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే దాని సంరక్షణ,  నిర్వహణపై కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే.. దాని నుంచి మెరుగైన అవుట్‌పుట్ పొందవచ్చు.

ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ అత్యంత ఖరీదైన.. అవసరమైన భాగం. ఇది అగ్ని, నీరు రెండింటి నుంచి సురక్షితంగా ఉంచబడాలి.. అలాగే బ్యాటరీ వోల్టేజ్ని ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. అదే సమయంలో, బ్యాటరీ పైన ఉండే పాయింట్స్ తుప్పు పట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. తుప్పుపట్టిన మనం చూసుకోకుంటే దాని బ్యాటరీకి చాలా నష్టం జరుగుతుంది.

హీట్- కూల్ రెండింటిపై..

ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీపై హీట్ గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. హీట్ ఎక్కువగా ఉంటే.. దానిలో షార్ట్ సర్క్యూట్ ప్రమాదం ఏర్పాడుతుంది. మరోవైపు, హీట్ చాలా తక్కువగా ఉంటే.. అప్పుడు బ్యాటరీ త్వరగా డిస్చార్జ్ అవుతున్నట్లుగా తెలుసుకోవాలి. అందుకే ఈ రెండింటి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సూర్యరశ్మికి ఎఫెక్ట్ ..

వేసవి కాలంలో సూర్యరశ్మి చాలా అధికంగా ఉంటుంది. దాని బ్యాటరీ దెబ్బతింటుంది. కాబట్టి నేరుగా సూర్యరశ్మి పడకుండా చూసుకోండి. నీడలో లేదా ఇంటి లోపల పార్క్ చేయండి. తద్వారా బ్యాటరీకి ఎలాంటి ప్రమాదం ఉండదు.

ప్రామాణిక ఛార్జర్ ఉపయోగించండి

ప్రతి ఎలక్ట్రిక్ వాహనం కోసం.. కంపెనీ ఒక ప్రామాణిక ఛార్జర్‌ను ఇస్తుంది. దాని నుంచి ఛార్జ్ చేయాలి. వేగంగా ఛార్జింగ్ కోసం ఫాస్ట్ ఛార్జర్‌లను చేయడం మానుకోండి. అలాగే దాని ఛార్జర్ పాడైతే.. లోకల్ ఛార్జర్‌కు బదులుగా.. ప్రామాణిక ఛార్జర్‌ను మాత్రమే తీసుకోండి(అంటే నిత్యం ఒకే ఛార్జర్‌ను మాత్రమే ఉపయోగించండి). కొంత డబ్బు ఆదా చేయడానికి లోకల్ ఛార్జర్‌ను తీసుకోకండి. లోకల్, ఫాస్ట్ ఛార్జర్‌లు రెండూ బ్యాటరీకి హాని చేస్తాయి.

ఓవర్‌లోడ్ చేయవద్దు..

ఓవర్‌లోడింగ్ ఏదైనా వాహనానికి హానికరం. కాబట్టి ముఖ్యంగా EV వాహనాల్లో దీనిని నివారించండి. ఎందుకంటే ఓవర్‌లోడ్ చేయడం వల్ల బ్యాటరీ చాలా త్వరగా డిశ్చార్జ్ అవుతుంది. ఇలా పదే పదే చేయడం వల్ల బ్యాటరీ త్వరగా పాడవుతుంది. దీంతో మీ బ్యాటరీ త్వరగా చెడిపోతుంది.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం