AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO : ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతంగా ఖరారు.. గతేడాది ఉన్న రేటునే యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం..!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020 21)గానూ ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా నిర్ణయించింది కేంద్రప్రభుత్వం.

EPFO : ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5 శాతంగా ఖరారు..  గతేడాది ఉన్న రేటునే యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం..!
Balaraju Goud
| Edited By: |

Updated on: Mar 04, 2021 | 8:13 PM

Share

epfo interest rates : ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్‌) వడ్డ రేటును కేంద్రం నిర్ధారించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020 21)గానూ ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా నిర్ణయించింది కేంద్రప్రభుత్వం. గురువారం శ్రీనగర్‌లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఈ సమావేశంలో వడ్డీరేటును ఖరారు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ దఫా వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందన్న ప్రచారం తొలుత జరిగినా.. గతేడాది ఉన్న రేటునే యథాతథంగా కొనసాగించారు. ఈ నిర్ణయంతో ఏకంగా 6 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించిన వడ్డీపై ఈపీఎఫ్ఓకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకుంది. 2018 19 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ వర్తిస్తుంది. 8.65 శాతంగా ఉన్న వడ్డీరేటును ఈసారి కూడా కొనసాగిస్తారన్న వార్తలొచ్చాయి. కానీ వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఈపీఎఫ్ఓ.

కోవిడ్‌ 19 మహమ్మారితో ఉత్పన్నమైన పరిస్థితుల దృష్ట్యా.. ఉద్యోగులు తమ ఖాతాల నుంచి భారీగా నగదును ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో డిపాజిట్లు తగ్గిపోయాయి. గత ఏడాది డిసెంబరు వరకూ దాదాపు 2 కోట్ల మంది ఈపీఎఫ్‌వో వినియోగదారులు రూ.73వేల కోట్లను వెనక్కి తీసుకున్నారని అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 2018 19లో రూ.81వేల కోట్లను చందాదారులు వెనక్కి తీసుకోగా.. 2020 21లో అంతకుమించిన స్థాయిలో ఉపసంహరణలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. 2019 20 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దాన్నే కొనసాగిస్తూ తాజాగా జరిగిన సమావేశం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2018 19లో అది 8.65 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు తాజా బడ్జెట్‌లో ఈపీఎఫ్‌పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల వాటా ఏడాదికి రూ.2.5 లక్షలు దాటితే వడ్డీపై పన్ను విధించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Read Also:  Covid-19: వారికి చికిత్సలో ప్రాధాన్యత ఇవ్వండి.. ప్రైవేటు ఆసుపత్రులకు సుప్రీంకోర్టు ఆదేశాలు

ఈ పది సెకండ్స్ వీడియో ఏకంగా రూ. 48 కోట్లకు అమ్ముడైంది.. ఎందుకు అంత ధర పలికిందో తెలుసా.!

పాల వ్యాపారంతో అదరగొడుతున్న 23 ఏళ్ల కుర్రాడు.. అవి అలాంటి ఇలాంటి పాలు కావు మరీ..! ఏంటో తెలుసా..