Budget 2024: కేంద్ర బడ్జెట్‌పైనే ఉద్యోగుల ఆశలు.. ఆ నిబంధన సడిలిస్తే అనేక లాభాలు

ముఖ్యంగా ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యల కోసం చూస్తారు. ఆదాయ స్లాబ్‌లు, పన్ను రేట్లు, పెరిగిన తగ్గింపుల చుట్టూ వేతన జీవలు ఆశలు పెట్టున్నారు. ముఖ్యంగా పాత పన్ను విధానంలో ఇంటి అద్దె భత్యానికి మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ సారి బడ్జెట్‌లో హెచ్‌ఆర్ఏ శ్లాబ్ పెంచితే చాలా మేలు కలుగుతుందని వేతన జీవులు ఆశిస్తున్నారు. అయితే బడ్జెట్‌లో హెచ్ఆర్ఏ శ్లాబ్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

Budget 2024: కేంద్ర బడ్జెట్‌పైనే ఉద్యోగుల ఆశలు.. ఆ నిబంధన సడిలిస్తే అనేక లాభాలు
Budget 2024
Follow us
Srinu

|

Updated on: Jun 27, 2024 | 4:40 PM

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం హ్యాట్రిక్ విజయం తర్వాత త్వరలోనే 2024 పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చే  బడ్జెట్ కావడంతో ఈ బడ్జెట్‌పై వేతన జీవులు ఎన్నో ఆశలను పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఆర్థిక భారాన్ని తగ్గించే చర్యల కోసం చూస్తారు. ఆదాయ స్లాబ్‌లు, పన్ను రేట్లు, పెరిగిన తగ్గింపుల చుట్టూ వేతన జీవలు ఆశలు పెట్టున్నారు. ముఖ్యంగా పాత పన్ను విధానంలో ఇంటి అద్దె భత్యానికి మినహాయింపు ఇచ్చారు. అయితే ఈ సారి బడ్జెట్‌లో హెచ్‌ఆర్ఏ శ్లాబ్ పెంచితే చాలా మేలు కలుగుతుందని వేతన జీవులు ఆశిస్తున్నారు. అయితే బడ్జెట్‌లో హెచ్ఆర్ఏ శ్లాబ్‌ల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

చాలా మంది యజమానులు తమ ఉద్యోగుల పరిహారంలో భాగంగా హెచ్‌ఆర్ఏను అందిస్తారు. హెచ్ఆర్ఏ పొందుతున్న ఉద్యోగి వారి వసతి కోసం అద్దె చెల్లిస్తుంటే హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయవచ్చు. ఉద్యోగి నివాసం ఆధారంగా పన్ను మినహాయింపు మొత్తం మారుతుంది. అద్దె ఇంట్లో నివసించని ఉద్యోగికి హెచ్‌ఆర్‌ఎ పూర్తిగా పన్ను విధిస్తారని నిపుణులు చెబుతున్నారు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10(13ఏ) హెచ్ఆర్ఏకు పన్ను మినహాయింపును అందిస్తుంది. అయితే పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేసేలా హెచ్‌ఆర్‌ఏ మొత్తం కింది వాటిలో తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హెచ్ఆర్ఏ మెట్రో, నాన్-మెట్రో నగరాల ఆధారంగా అంచనా వేయాలి. రాజ్యాంగం (డెబ్భై-నాలుగో సవరణ) చట్టం, 1992, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్), ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పూణె, హైదరాబాద్, చెన్నైలను మెట్రో నగరాలుగా పేర్కొంది. అయితే, మొత్తం అభివృద్ధి (జనాభా, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక, ఆర్థిక అంశాలు మొదలైనవి) పరిగణనలోకి తీసుకుంటే మెట్రో నగరాల జాబితా చాలా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుత కాలాన్ని ప్రతిబింబించేలా పన్ను చట్టాలు నవీకరించలేదు కాబట్టి ఈ నగరాల్లో జీతం పొందే వ్యక్తులకు హెచ్ఆర్ఏ పన్ను మినహాయింపు 40 శాతం తక్కువగా ఉంది.

మెట్రో నగరాల వెలుపల నివసిస్తే మీ ఆదాయంలో ఎక్కువ శాతాన్ని పన్నుల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. అయితే బెంగళూరులో నివసిస్తున్న వ్యక్తి కోల్‌కతా లేదా చెన్నైలో ఉన్న వారి కంటే ఎక్కువ సగటు అద్దెను చెల్లించాల్సి ఉంటుంది. వీటిని పన్ను ప్రయోజనాల కోసం మెట్రో నగరాలుగా పరిగణిస్తారు. ఆదాయపు పన్ను చట్టం ద్వారా వర్గీకరించిన వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్-మెట్రో నగరాల్లో నివసిస్తున్న ప్రజలు, వేగవంతమైన పట్టణీకరణ కారణంగా అధిక అద్దెలను ఎదుర్కొంటున్నారు. అయితే మెట్రో నగరాలతో సరిసమానంగా అద్దె చెల్లిస్తున్నా వారి కంటే తక్కువ పన్ను మినహాయింపు లభిస్తుందని సగటు ఉద్యోగి వాదన. కాబట్టటి నాన్-మెట్రో నగరాల విషయంలో  పన్ను చెల్లింపుదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి అద్దె మినహాయింపులను క్లెయిమ్ చేసే నిబంధనలను ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

భారత రాజ్యాంగం ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, కోల్‌కతా, పూణే, హైదరాబాద్, చెన్నై వంటి ఇతర నగరాలలో బెంగళూరును మెట్రో నగరంగా గుర్తించింది. అయితే, ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం భారతదేశంలో కేవలం నాలుగు నగరాలు (ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా) ) మెట్రో నగరాలుగా పరిగణిస్తారు. అందువల్ల ప్రాథమిక జీతంలో 50 శాతం ఇంటి అద్దె భత్యం, నాన్-మెట్రో నగరాలకు (ఇతర నగరాలు) ప్రాథమిక జీతంలో 40 శాతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. ఇతర నగరాలతో పోలిస్తే బెంగళూరులో జీవన వ్యయం పెరుగుతోంది, కాబట్టి ఉద్యోగులు 50 శాతం హెచ్‌ఆర్‌ఏ మినహాయింపును ఇవ్వాలని చెబుతున్నారు. బెంగళూరు, పూణే, హైదరాబాద్, అహ్మదాబాద్‌లను హెచ్‌ఆర్‌ఏ లెక్కింపు కోసం మెట్రోలుగా గుర్తించాలని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఎలాంటి స్పందన లేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. కాబట్టి ఈ బడ్జెట్‌లోనైనా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..