Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన వంట నూనె ధరలు..!

Edible Oil Prices: ప్రస్తుతం వంట నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో స..

Edible Oil Prices: కేంద్రం గుడ్‌న్యూస్‌.. దిగి వచ్చిన వంట నూనె ధరలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 12, 2022 | 6:03 PM

Edible Oil Prices: ప్రస్తుతం వంట నూనె ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న నిత్యవసర సరుకుల ధరలతో సతమతమవుతున్న జనాలకు వంటనూనె ధరలు ఊరట కలిగిస్తున్నాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో ఇబ్బందులకు గురవుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేశంలో రిటైల్‌ మార్కెట్లో వంట నూనె ధరలు భారీగా తగ్గుముఖం పట్టినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. కిలో వంటనూనెపై రూ.20 వరకు తగ్గినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. అంతర్జాతీయంగా మార్కెట్లో కమోడిటీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ, వంట నూనెల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇప్పటికి దిగి వచ్చిన ధరలు.. తాజాగా మరింత తగ్గుముఖం పట్టాయి. గత సంవత్సరం భారీగా ఉన్న నూనె ధరలు.. అక్టోబర్‌ 2021 నుంచి తగ్గుతూ వస్తున్నాయి.

ఇక వేరుశనగ నూనె ధర కిలోకు రూ.180 వరకు ఉండగా, మస్టర్డ్ ఆయిల్ ధర రూ.184.59గా ఉన్నట్టు తాజా డేటాలో వెల్లడైంది. అలాగే సోయా నూనె ధర రూ.148.85గా, పామాయిల్ ధర రూ.128.5గా, పొద్దుతిరుగుడు నూనెధర రూ.162.4గా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వంటనూనె కంపెనీలు, అదనీ విల్మర్‌ రుచి ఇండస్ట్రీస్‌ రెండు కంపెనీలు కూడా ధరలను తగ్గించాయి. లీటర్‌ నూనెపై రూ.15 నుంచి రూ.20 వరకు తగ్గించినట్లు తెలిపాయి.

సుంకాలు తగ్గించిన ప్రభుత్వం.. దిగుమతి సుంకాలను తగ్గించడం, నకిలీ నిల్వలను అరికట్టడం వంటి కఠినమైన చర్యల కారణంగా ప్రస్తుతం వంటనూనె ధరలు దిగి వస్తున్నాయి.దేశంలో వినియోగించే 56 నుంచి 60 శాతం వంటనూనెలను ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. గ్లోబల్‌గా ఉత్పత్తి తగ్గడంతో మన దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కస్టమర్లు మస్తు ఇబ్బందులు పడ్డాల్సి వచ్చింది.

ఇక పామాయిల్‌పై 7.5 శాతం, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై 5 శాతం, ఆర్‌బీడీ పామోలిన్ ఆయిల్‌పై ఇటీవల 17.5శాతం నుండి 12.5%కి తగ్గించబడింది. ఇక శుద్ధి చేసిన సోయాబీన్, శుద్ధి చేసిన సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై సుంకం ప్రస్తుత 32.5 శాతం నుండి 17.5శాతంకు తగ్గించబడింది.

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1789157

Oil Price

ఇవి కూడా చదవండి:

Honda CB300R: హోండా నుంచి సరికొత్త బైక్‌ విడుదల.. ఫీచర్స్‌, ధర వివరాలు..!

RuPay Debit Card: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రూపే కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డు.. రూ.10 లక్షల వరకు ప్రయోజనం!

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!