ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో
ధనవంతుల కుటుంబాలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం. దిగుమతి చేసుకున్న వస్తువుల వ్యాపారాలపై వారి ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించింది.
ధనవంతుల కుటుంబాలకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం. దిగుమతి చేసుకున్న వస్తువుల వ్యాపారాలపై వారి ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించింది. ఈ విషయాన్ని ఇప్పటికే ఆ వ్యాపారాలు చేస్తున్న పలు ధనిక కుటుంబాలకు యూఏఈ ప్రభుత్వం తెలియపరిచిందని తెలుస్తోంది. దానికి సంబంధించి ఓ చట్టాన్ని సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఆ చట్టం ప్రకారం విదేశీ వస్తువుల అమ్మకాలకు సంబంధించిన వ్యాపారాల లైసెన్స్ ఆటోమేటిక్ పునరుద్ధరణను ఎత్తేయనున్నారు. తద్వారా విదేశీ సంస్థలు నేరుగా తమ ఉత్పత్తులను యూఏఈలో విక్రయించుకునే వెసులుబాటు కల్పించనుంది. లేదా వేరే సంస్థకు తమ ఉత్పత్తులను అమ్మే హక్కును అందించేందుకు అవకాశం ఇవ్వనుంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఇంపోర్టెడ్ వస్తువుల వ్యాపారంలో గుత్తాధిపత్యానికి చెక్ !! వీడియో
Viral Video: నాతోనే గేమ్సా !! పులిని ముప్పు తిప్పలు పెట్టిన బాతు !! వీడియో