RuPay Debit Card: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రూపే కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డు.. రూ.10 లక్షల వరకు ప్రయోజనం!

RuPay Debit Card: ప్రభుత్వరంగబ్యాంకుఅయిన యూసీఓ బ్యాంకు తన 79వ దినోత్సవం సందర్భంగా ప్రీమియం కస్టమర్లకు గుడ్‌న్యూస్‌..

RuPay Debit Card: ఆ బ్యాంకు కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. రూపే కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌ కార్డు.. రూ.10 లక్షల వరకు ప్రయోజనం!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 12, 2022 | 2:44 PM

RuPay Debit Card: ప్రభుత్వరంగబ్యాంకుఅయిన యూసీఓ బ్యాంకు తన 79వ దినోత్సవం సందర్భంగా ప్రీమియం కస్టమర్లకు గుడ్‌న్యూస్‌ తెలిపింది. యూసీవోబ్యాంకు రూపే కాంటాక్ట్‌లెస్‌ డెబిట్‌కార్డులను ఎంపిక చేసింది. రూపే సెలెక్ట్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ ప్రారంభించబడింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( NPCI )తో కలిసి UCO బ్యాంక్ తన ప్రీమియం కస్టమర్ సెగ్మెంట్ కోసం ఈ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ అనేక ప్రయోజనాలు ఉంటాయని బ్యాంకు తెలిపింది.

కార్డ్ ద్వారా, వినియోగదారులు POS లేదా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 2 లక్షల వరకు కొనుగోళ్లు చేయవచ్చు. అదే సమయంలో, ATM నుంచి విత్‌డ్రాయల్‌ పరిమితి రూ. 50,000 వరకు ఉంటుంది. అలాగే జిమ్ సభ్యత్వం, దేశీయంగా అంతర్జాతీయ లాంజ్ వరకు ప్రీమియం సౌకర్యాలను పొందేందుకు ఈ కార్డును ఉపయోగించవచ్చని యూకో బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇష్రాక్ అలీ ఖాన్ తెలిపారు.

రూపే కార్డుపై రూ.10 లక్షల ప్రయోజనం: ఈ రూపే (RuPay) సెలెక్ట్ డెబిట్ కార్డ్ అనేది మీ మెరుగైన జీవితం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ప్రత్యేక ఆఫర్‌లతో రూపే అందించే అత్యంత ప్రీమియం ఆఫర్‌లలో ఒకటి. రూపే సెలెక్ట్ డెబిట్ కార్డ్‌లో, కస్టమర్ రూ. 10 లక్షల వరకు బీమా రక్షణను పొందుతారు. ఇందులో, కార్డుదారుడు వ్యక్తిగత ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యానికి రూ. 10 లక్షల వరకు పొందుతాడు.

UCO బ్యాంక్ రూపే కార్డు ప్రయోజనాలు

► ఈ కార్డ్‌లో ప్రతి నెలా రెండు ఉచిత డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్. అలాగే, 15 నగరాల్లోని 25 కంటే ఎక్కువ విమానాశ్రయాల లాంజ్‌లకు ఉచిత ప్రవేశం ఉంటుంది.

► ప్రతి సంవత్సరం రెండు ఉచిత అంతర్జాతీయ లాంజ్‌లను ఉపయోగించుకునే సౌకర్యం ఉంది. 300 నగరాల్లో 500కి పైగా లాంజ్‌లకు యాక్సెస్ ఉంటుంది.

► మెంబర్‌షిప్ పొడిగింపుపై 15 రోజుల ఉచిత జిమ్ సభ్యత్వం, 40-50 శాతం తగ్గింపు అందుబాటులో ఉంటుంది.

► ఒక సంవత్సరంలో ఒక కాంప్లిమెంటరీ ప్రీమియం హెల్త్ చెకప్ ప్యాకేజీ.

► ఒక సంవత్సరంలో కాంప్లిమెంటరీ గోల్ఫ్ కోచింగ్ నేర్చుకునే అవకాశాన్ని పొందండి.

► అన్ని రూపే సెలెక్ట్ కాంటాక్ట్‌లెస్ డెబిట్ కార్డ్ హోల్డర్లు రూ.10 లక్షల వరకు బీమా పొందేందుకు అర్హులు.

ఇవి కూడా చదవండి:

NetBanking: నెట్‌బ్యాంకింగ్‌ చెల్లింపులపై ఆ బ్యాంకు కీలక నిర్ణయం.. కస్టమర్‌ పేరు, పాస్‌వర్డ్‌ అవసరం లేకుండానే లావాదేవీలు!

Credit Card: మీరు ఆ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఇక నుంచి బాదుడే బాదుడు..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!