Edible Oil: పండగ సీజన్‌లో సామాన్యులకు షాకిస్తున్న వంట నూనె ధరలు!

పండుగల సీజన్‌లో ద్రవ్యోల్బణం మరోసారి సామాన్య ప్రజలను తాకింది. సెప్టెంబర్‌లో భారతదేశం ఆహార నూనెల దిగుమతి వార్షిక ప్రాతిపదికన 29 శాతం తగ్గి 10,64,499 టన్నులకు చేరుకుంది. క్రూడ్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు తక్కువగా ఉండటం వల్ల ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో వంటనూనెల..

Edible Oil: పండగ సీజన్‌లో సామాన్యులకు షాకిస్తున్న వంట నూనె ధరలు!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 12, 2024 | 2:33 PM

పండుగల సీజన్‌లో ద్రవ్యోల్బణం మరోసారి సామాన్య ప్రజలను తాకింది. సెప్టెంబర్‌లో భారతదేశం ఆహార నూనెల దిగుమతి వార్షిక ప్రాతిపదికన 29 శాతం తగ్గి 10,64,499 టన్నులకు చేరుకుంది. క్రూడ్, రిఫైన్డ్ పామాయిల్ దిగుమతులు తక్కువగా ఉండటం వల్ల ఎడిబుల్ ఆయిల్ దిగుమతులు తగ్గాయి. గతేడాది ఇదే నెలలో వంటనూనెల దిగుమతి 14,94,086 టన్నులు ఉన్నట్లు పరిశ్రమ డేటా ద్వారా తెలుస్తోంది.

సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) శుక్రవారం సెప్టెంబరులో కూకింగ్‌ ఆయిల్‌ దిగుమతి డేటాను విడుదల చేసింది. సెప్టెంబరులో నాన్-ఎడిబుల్ ఆయిల్స్ దిగుమతి వార్షిక ప్రాతిపదికన 57,940 టన్నుల నుంచి 22,990 టన్నులకు తగ్గింది. డేటా ప్రకారం, నూనెల దిగుమతులు సెప్టెంబర్‌లో 15,52,026 టన్నులతో పోలిస్తే 30 శాతం తగ్గి 10,87,489 టన్నులకు చేరుకున్నాయి. దీంతో మార్కెట్లో వంట నూనె ధరలు పెరిగిపోతున్నాయి. ఇటీవల ఆయిల్‌ ధరలు 25 రూపాయలకుపైనే పెరిగింది.

విక్రయాలు తగ్గుముఖం

ఎడిబుల్ ఆయిల్ కేటగిరీలో ముడి పామాయిల్ దిగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4,32,510 టన్నులకు తగ్గాయని, గత ఏడాది ఇదే నెలలో 7,05,643 టన్నులుగా ఉన్నట్టు సీఈఏ డేటా వెల్లడించింది. మరోవైపు శుద్ధి చేసిన పామాయిల్‌ దిగుమతి 1,28,954 టన్నుల నుంచి 84,279 టన్నులకు తగ్గింది. క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతి కూడా 3,00,732 టన్నుల నుంచి 1,52,803 టన్నులకు తగ్గింది. జూలై-ఆగస్టు మధ్య కాలంలో అధిక దిగుమతులు, డిమాండ్ లేకపోవడం వల్ల దిగుమతులు తగ్గుముఖం పట్టాయని SEA పేర్కొంది. అటువంటి పరిస్థితిలో పోర్టులలో స్టాక్ పెరిగింది. అంతేకాకుండా, ధరల హెచ్చుతగ్గుల కారణంగా దిగుమతిదారులు అప్రమత్తంగా ఉన్నారు.

రిటైల్ మార్కెట్‌లో చమురు ధర 10 శాతం వరకు పెరిగింది. ఆవనూనెలో అత్యధిక పెరుగుదల కనిపిస్తోంది. సోయాబీన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరలు కూడా కొంతకాలంగా పెరిగాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆయిల్‌ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు పండుగల సీజన్‌ కారణంగా దేశంలో ఎడిబుల్‌ ఆయిల్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో అక్టోబర్‌లో పామాయిల్‌ దిగుమతి 7 లక్షల టన్నులకు మించవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి