Economic Survey 2024: ప్రతి సంవత్సరం 78 లక్షల మందికి ఉద్యోగాలు: ఆర్థిక సర్వేలో వెల్లడి

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వే అనేది గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ సమగ్ర సమీక్ష లేదా వార్షిక నివేదిక గురించి తెలుసుకుందాం. ఇది భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) పర్యవేక్షణలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగంచే తయారు చేశారు. ఈ ఏడాది ఆర్థిక సర్వే బడ్జెట్ ప్రకటనకు ఒకరోజు ముందు జూలై 22న విడుదలైంది..

Economic Survey 2024: ప్రతి సంవత్సరం 78 లక్షల మందికి ఉద్యోగాలు: ఆర్థిక సర్వేలో వెల్లడి
Nirmala Sitharaman
Follow us
Subhash Goud

| Edited By: Ravi Kiran

Updated on: Jul 22, 2024 | 10:26 PM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను సమర్పించారు. ఆర్థిక సర్వే అనేది గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ సమగ్ర సమీక్ష లేదా వార్షిక నివేదిక గురించి తెలుసుకుందాం. ఇది భారతదేశ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) పర్యవేక్షణలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల విభాగంచే తయారు చేశారు. ఈ ఏడాది ఆర్థిక సర్వే బడ్జెట్ ప్రకటనకు ఒకరోజు ముందు జూలై 22న విడుదలైంది. ఇది ఆర్థిక పనితీరు, ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ విధాన కార్యక్రమాల గురించి పూర్తి వివరాలను అందిస్తుంది. ఇది కాకుండా, ఇది రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అకౌంట్లను కూడా అందిస్తుంది.

78 లక్షల మందికి ఉద్యోగాలు

ఆర్థిక సర్వేను మొదట లోక్‌సభలో, ఆ తర్వాత రాజ్యసభలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రవేశపెడతారు. పెరుగుతున్న శ్రామికశక్తి అవసరాలను తీర్చేందుకు, భారత ఆర్థిక వ్యవస్థ 2030 నాటికి వ్యవసాయేతర రంగంలో ఏటా సగటున 78.5 లక్షల ఉద్యోగాలను సృష్టించాల్సిన అవసరం ఉందని సర్వే పేర్కొంది. దీని అర్థం ఆర్థిక వ్యవస్థ వృద్ధిని కొనసాగించాలంటే ప్రతి సంవత్సరం సగటున 78 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉంటుంది. దీని కారణంగా డిమాండ్ తగ్గదు. అలాగే సరఫరా, సమతుల్యత కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

వృద్ధి రేటు ఇలాగే ఉండొచ్చు

ఆర్థిక సర్వేను సమర్పిస్తూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సర్వే అని చెప్పారు. జిడిపి వృద్ధి, ద్రవ్యోల్బణం, ఉపాధి, ఆర్థిక లోటు వంటి అనేక డేటాను ఈ సర్వేలో పొందుపరిచారు. ప్రపంచ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతతో పోరాడుతున్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 6.5 శాతం నుంచి 7 శాతం మధ్య ఉండవచ్చని సమాచారం. గత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది. అయితే ప్రభుత్వం ఇచ్చిన అంచనా ఆర్‌బీఐ అంచనా 7.2 శాతం కంటే తక్కువ.

దేశ వృద్ధిరేటు

ప్రీ-బడ్జెట్ డాక్యుమెంట్‌గా పిలిచే ఈ ఆర్థిక సర్వే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 6.5 శాతం నుంచి 7 శాతానికి చేరుకోవచ్చని పేర్కొంది. జూన్‌లో 7.2 శాతం వృద్ధిని ఆర్‌బీఐ అంచనా వేసింది. అటువంటి పరిస్థితిలో, ప్రభుత్వం ఆర్బీఐ కంటే దేశ వృద్ధిని తక్కువగా అంచనా వేసింది. ద్రవ్యోల్బణం విషయంలో ప్రభుత్వం కూడా తనవంతుగా కృషి చేస్తోంది. ఆర్థిక సర్వే ప్రకారం, దేశంలో ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ప్రపంచంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత వాతావరణం ఉంది. దీని ప్రకారం, దేశ ఆర్థిక వ్యవస్థ చాలా మెరుగైన స్థితిలో ఉంది.

వ్యవసాయంపై దృష్టి పెంచాలి:

వ్యవసాయ రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. అయితే ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని సర్వేలో తేలింది. ఈ ఏడాది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన 33 ఆస్తులను గుర్తించారు. ప్రయివేటు రంగం లాభాల్లో పెరుగుదల కనిపించినా ఉద్యోగాల కల్పనలో మాత్రం చాలా వెనుకబడిందని సర్వేలో తేలింది.

ఇది కూడా చదవండి: Budget 2024: ఈ బడ్జెట్‌లో మోడీ సర్కార్ వీటిపై భారీ ప్రకటన చేయనుందా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి