Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: ఒకే దేశం.. ఒకే బంగారం.. ఒకే ధర.. అమలుకు వేగంగా అడుగులు..

ఒకే దేశం, ఒకే బంగారం ధర అనే నినాదం బంగారం కొనుగోళ్లను మరింత పెంచుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఖాతాదారులలో విశ్వాసం పెంచడానికి, విక్రయాలతో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇండియన్ జ్యూవెలర్స్ అండ్ బులియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా , ఆలిండియా జెమ్ అండ్ జ్యూవెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) దీనిపై పరిశ్రమలోని వివిధ వాటాదారులతో చర్చలు జరుపుతున్నాయి.

Gold Price: ఒకే దేశం.. ఒకే బంగారం.. ఒకే ధర.. అమలుకు వేగంగా అడుగులు..
Gold Price
Follow us
Madhu

|

Updated on: Jul 22, 2024 | 3:57 PM

మన దేశంలో బంగారం వాడకం చాలా ఎక్కువ. పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలలో బంగారు ఆభరణాలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ప్రతి ఒక్కరూ తన స్తోమతకు తగ్గట్టుగా ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తూనే ఉంటారు. దేశంలోని బంగారు ఆభరణాల దుకాణాలు ఎప్పుడు రద్దీగా ఉంటాయి. ఇక సీజన్ లో కొనుగోలు దారులతో కిటకిటలాడుతుంటాయి. అయితే బంగారం ధర అన్ని రాష్ట్రాలలో ఒకేలా ఉండదు. ఈ నేపథ్యంలో దేశమంతటా ఓకే ధరను తీసుకువచ్చేందుకు ఆభరణాల పరిశ్రమ సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా ఒకే దేశం, ఒకే ధర (ఓఎన్ఓఆర్) అనే నినాదంతో ముందుకు వచ్చింది.

బంగారం ధర..

బంగారం ధర యూఎస్ డాలర్ పై ఆధారపడి ఉంటుంది. మన దేశం బంగారాన్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నందున కరెన్సీ మారకం విలువ, వివిధ సుంకాలు దాని ధరను ప్రభావితం చేస్తాయి. రూపాయితో పోల్చితే అమెరికా డాలర్ బలపడినప్పుడు దేశీయంగా బంగారం ధరలు పెరుగుతాయి.

ఒకే దేశం.. ఒకే ధర..

ఒకే దేశం, ఒకే బంగారం ధర అనే నినాదం బంగారం కొనుగోళ్లను మరింత పెంచుతుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఖాతాదారులలో విశ్వాసం పెంచడానికి, విక్రయాలతో పారదర్శకత తీసుకురావడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇండియన్ జువెలర్స్ అండ్ బులియన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా , ఆలిండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) దీనిపై పరిశ్రమలోని వివిధ వాటాదారులతో చర్చలు జరుపుతున్నాయి. త్వరలో ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కూాడా ఉంది.

పారదర్శకత..

జీజేసీ ఛైర్మన్ సయం మెహ్రా మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ధర విధానం బంగారు ఆభరణాల విక్రయాలలో పారదర్శకతను పెంచుతుందని, ఏకరీతి ధరల నిర్మాణాన్ని సృష్టిస్తుందన్నారు. వ్యత్యాసాలను తగ్గించి, న్యాయమైన మార్కెట్‌ను ప్రోత్సహిస్తుదని అభిప్రాయపడ్డారు. అలాగే వినియోగదారుల విశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుందన్నారు. ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు పరిశ్రమకు తమ సంఘం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

ధరల తేడాకు కారణమిదే..

దేశంలోని వివిధ రాష్ట్రాలలో బంగారం ధరల మధ్య తేడాలు ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. లాజిస్టికల్ ఖర్చులు, విభిన్నమైన డిమాండ్, సరఫరా డైనమిక్స్‌లో తేడాల కారణంగా ధరలు మారుతూ ఉంటాయి. ఏకీకృత ధరల విధానంతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. దేశవ్యాప్తంగా స్థిరత్వం, అనుకూలతను కలిగిస్తుంది.

ప్రస్తుతం ధర వివరాలు..

ప్రస్తుతం దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (జీఎస్టీ, వ్యాట్ మినహా) రూ.73,339 ఉంది. అయితే ఢిల్లీలో రూ.74,170కు, చెన్నైలో రూ.74,510కు విక్రయిస్తున్నారు. జీఎస్టీతో సహా పారదర్శకత చర్యలను అవలంబించడం, హాల్‌మార్క్ ప్రత్యేక గుర్తింపు సంఖ్యలను అమలు చేయడం వంటి వాటిని ఆభరణాలను పరిశ్రమను కచ్ఛితంగా అమలు చేస్తోంది.

సానుకూల స్పందన..

ఐబీజేఏ జాతీయ ప్రతినిధి కుమార్ జైన్ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే బంగారం ధర పై దేశంలోని వివిధ పరిశ్రమల సంఘాలతో చర్చలు జరుగుతున్నాయిని, వారి స్పందన కూడా సానుకూలంగా ఉందన్నారు. అన్నీ సవ్యంగా జరిగితే ఈ ఏడాది చివరిలోపు అమలు చేయాలని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం బంగారం ధరలు అస్థిరంగా ఉన్నప్పటికీ దీపావళికి ముందు 10 గ్రాముల బంగారం రూ.80 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ఆభరణాలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. మెజారిటీ ఆభరణాల వ్యాపారులు ’ఒక దేశం ఒకే రేటు‘ విధానాన్ని అవలంబించడానికి అంగీకరించారన్నారు. సెప్టెంబర్ జరిగే సమావేశంలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..