Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

E Shram Card: ఈ శ్రమ్‌ కార్డుకి అప్లై చేశారా.. వారు ఈ పథకానికి అనర్హులు..!

E Shram Card: కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ 26 ఆగస్టు 2021న E- శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. దేశంలోని కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల రికార్డులను తయారు చేయడం,

E Shram Card: ఈ శ్రమ్‌ కార్డుకి అప్లై చేశారా.. వారు ఈ పథకానికి అనర్హులు..!
Farmer Kisan
Follow us
uppula Raju

|

Updated on: Mar 05, 2022 | 10:13 PM

E Shram Card: కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ 26 ఆగస్టు 2021న E- శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. దేశంలోని కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికుల రికార్డులను తయారు చేయడం, వారికి అన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అందించడం ఈ పోర్టల్‌ ఉద్దేశ్యం. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వ్యక్తులందరికీ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ఈ – శ్రమ్ కార్డ్ జారీ అవుతుంది. దేశవ్యాప్తంగా 25 కోట్ల మందికి పైగా ప్రజలు ఈ-శ్రమ్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకున్నారు. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న అసంఘటిత రంగ కార్మికులకు ఈ-శ్రమ్ పథకం కింద రూ.2 లక్షల ఉచిత బీమా కల్పిస్తారు. ఈ పథకం కింద భారత ప్రభుత్వం దేశంలోని కోట్లాది మంది రైతులకు సహాయం చేస్తుంది. కానీ కొంతమంది ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేరు. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఈ పథకం కింద వలస కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగానికి సంబంధించిన దేశంలోని కోట్లాది మంది కార్మికులు ప్రభుత్వ ప్రయోజనం పొందుతారు. వీరితో పాటు కూలీ పనులు చేసుకునే రైతులు లేదా సాగు చేసేందుకు భూమి లేని రైతులు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు. అయితే ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న రైతులందరూ ఈ పథకం ప్రయోజనాన్ని పొందలేరు.

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ-శ్రమ్ పథకం కింద రాష్ట్రంలోని కార్మికులకు నెలకు 500 రూపాయలు ఇచ్చింది. ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న కార్మికులకు రెండు నెలల పాటు వారి బ్యాంకు ఖాతాలలో 1000 రూపాయల చొప్పున జమ చేసింది. ఇప్పటికే ఏదైనా ప్రభుత్వ పెన్షన్ పథకం లేదా PM కిసాన్ యోజన ద్వారా ప్రయోజనం పొందుతున్న రైతులు ఈ పథకం నుంచి ప్రయోజనం పొందలేరు. ఉత్తరప్రదేశ్‌లో పింఛను పథకం, పిఎం కిసాన్ యోజన ద్వారా ప్రయోజనాలు పొందుతున్న రైతులకు కూడా ఈ పథకం ప్రయోజనాలు అందించడం లేదు. వీరు కాక ఇతర వర్గాల కార్మికులందరికీ 500 చొప్పున ఇస్తున్నారు.

ఆ పొదుపు ఖాతాదారులకి హెచ్చరిక.. మార్చిలో ఈ పని చేయకపోతే పెనాల్టీలు భరించలేరు..!

IND W vs PAK W: సూపర్‌ సండే.. భారత్, పాకిస్తాన్‌ మధ్య రసవత్తర పోరు.. రికార్డులు బ్రేకయ్యేనా..!

Driving License: కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేస్తున్నారా.. కచ్చితంగా ఈ విషయాలు గమనించండి..!