Business Idea: తక్కువ పెట్టుబడితో నెలనెలా లక్షల్లో ఆదాయం.. ఈ బిజినెస్ ఐడియా మీ కోసమే..!
ఇటీవల కాలంలో దోశ పాయింట్లు ఎక్కువ ప్రజాదరణను పొందుతున్నాయి. ముఖ్యంగా ఉదయంతో పాటు సాయంకాలం సమయంలోనూ టిఫిన్ సెంటర్స్ వద్ద ఆహారప్రియులు క్యూ కడుతున్నారు. అయితే కష్టపడి నలుగురి ప్రత్యేక గుర్తింపుతో వ్యాపారం చేయాలనేకునే వారికి దోశ పాయింట్ ఓ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. క్వాలిటీ పదార్థాలతో టేస్టీగా టిఫిన్స్ వేస్తే ప్రజాదరణ పొందడం పెద్ద కష్టమేమి కాదు. అయితే భారతదేశంలో దోశ పాయింట్ పెట్టాలంటే నిర్ధిష్ట నియమాలను పాటించాల్సి ఉంటుంది.
భారతదేశవ్యాప్తంగా సౌత్ ఇండియా ఆహారపదార్థాలకు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా సౌత్ ఇండియా టిఫిన్స్‌ను చాలా మంది ఇష్టపడతారు. అయితే సౌత్ ఇండియాలో ఎక్కువగా తినే దోశను ఉత్తరాదిలో వివిధ రకాల మిక్చర్స్ ప్రత్యేకంగా వేస్తారు. ఈ విషయాన్ని పక్కనపెడితే పెరుగుతున్న ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ నేపథ్యంలో ఇటీవల కాలంలో దోశ పాయింట్లు ఎక్కువ ప్రజాదరణను పొందుతున్నాయి. ముఖ్యంగా ఉదయంతో పాటు సాయంకాలం సమయంలోనూ టిఫిన్ సెంటర్స్ వద్ద ఆహారప్రియులు క్యూ కడుతున్నారు. అయితే కష్టపడి నలుగురి ప్రత్యేక గుర్తింపుతో వ్యాపారం చేయాలనేకునే వారికి దోశ పాయింట్ ఓ మంచి ఆప్షన్‌గా ఉంటుంది. క్వాలిటీ పదార్థాలతో టేస్టీగా టిఫిన్స్ వేస్తే ప్రజాదరణ పొందడం పెద్ద కష్టమేమి కాదు. అయితే భారతదేశంలో దోశ పాయింట్ పెట్టాలంటే నిర్ధిష్ట నియమాలను పాటించాల్సి ఉంటుంది. కాబట్టి దోశ పాయింట్ పెట్టాలనుకునే వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం.
ప్రత్యేక మెనూ
దోశపాయింట్‌ను పెట్టాలంటే వివిధ రకాల దోశలను వేయడం నేర్చుకోవాలి. అంతేకాకుండా హోటల్‌లో ప్రత్యేక మెనూ అమలు చేయడం ద్వారా ప్రజాదరణను సింపుల్‌గా పొందవచ్చు. మన దేశంలో ప్రజలు సాధారణంగా అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్ కోసం దక్షిణ భారతీయ ఆహారాలను ఇష్టపడతారు. మీరు ప్రామాణికమైన మెయిన్ కోర్స్ మెనూ ఐటెమ్‌లను పరిచయం చేయవచ్చు.
ప్రదేశం
దోశ పాయింట్ వ్యాపారం కోసం మీరు సరైన లొకేషన్ కోసం వెతుకుతున్నప్పుడు బాగా రద్దీగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకోవడం ముఖ్యం. పైగా షాపు అందరికీ కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే షాపు రెంట్ కూడా మనకు అనుకూలంగా ఉండాలి. తగినంత అందమైన డైనింగ్‌తో పాటు వంటగది స్థలాన్ని కలిగి ఉండాలి. అనుకూలీకరించిన వాతావరణాన్ని రూపొందించాలి.
తప్పనిసరి లైసెన్స్‌లు
భారత ప్రభుత్వ నిబంధనలు, చట్టాల ప్రకారం ప్రతి ఆహార వ్యాపారం తప్పనిసరిగా లైసెన్స్‌లను కలిగి ఉండాలి. ఒక రెస్టారెంట్‌కు అవసరమైన లైసెన్స్‌లు లేకపోతే జరిమానాలు చెల్లించాదలి. ఉంటుంది. భారతదేశంలో ఆహార వ్యాపారం కోసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ తప్పనిసరి. అలాగే వాణిజ్య లైసెన్స్, షాప్, ఎస్టాబ్లిష్‌మెంట్ లైసెన్స్‌తో పాటు ఎన్‌ఓసీ (రాత్రి 11 తర్వాత వ్యాపారాన్ని కొనసాగించాలంటే) కావాల్సి ఉంటుంది.
సిబ్బంది నియామకం
ఏదైనా థీమ్-ఆధారిత రెస్టారెంట్ కోసం అనుభవజ్ఞులైన సిబ్బందిని కలిగి ఉండడం చాలా మంచిది. కూరగాయలను సరైన పద్ధతిలో కోసే వారితో పాటు మంచి వంట మాస్టారును నియమించుకోవాలి. అలాగే రెస్టారెంట్‌లో వెయిటర్స్, క్లీనింగ్ స్టాఫ్‌ను కూడా అనుభవం ఉన్న వారిని నియమించుకోవడం ఉత్తమం.
షాపింగ్
టిఫిన్ పాయింట్ అంటేనే పిండి పదార్థాలతో చేసే వంటలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దోశ పాయిం్ పెట్టాలనుకునే వారికి వాణిజ్య వంటగది పరికరాలు అవసరం. వెట్ గ్రైండర్, స్టెయిన్‌లెస్ స్టీల్ ఇడ్లీ మేకర్, దోశ పెనం, డిష్ వాషర్‌సామగ్రితో పాటు వంట సామగ్రిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి కోసం లోకల్ మార్కెట్‌ను ఆశ్రయించే బదులు హోల్‌సేల్ మార్కెట్‌లో కొనుగోలు చేయాలి.
మార్కెటింగ్
మీ వ్యాపారానికి మంచి మార్కెటింగ్ అవసరం. ముఖ్యంగా నలుగురిలో మీ వ్యాపారం ప్రత్యేకంగా ఉండాలంటే మీ దోశ పాయింట్ పేరుపై ప్రత్యేక లోగోను డిజైన్ చేసుకోవాలి. అంతే కాకుండా మంచి ట్యాగ్ లైన్‌ను పెట్టుకోవాలి. అలాగే ఆన్‌లైన్‌లో మీ వ్యాపారం గురించి ప్రకటనలు ఇవ్వాలి. అంతేకాకుండా మొదట్లో మీ వ్యాపారాన్ని ప్రజలకు అలవాటు చేయడానికి డిస్కౌంట్లతో పాటు ప్రత్యేక కూపన్లను అందించాలి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..