Special Train: హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.. సమయ వేళలు ఇవే..

ఇక ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరుగనుంది. ఇందు కోసం దేశ వ్యాప్తంగా చాలా మంది అయోధ్యకు తరలి వెళ్తున్నారు. మున్ముందు కూడా భక్తుల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంటోంది. అయోధ్యకు వెళ్లే వారి కోసం ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రామమందిర్ ..

Special Train: హైదరాబాద్‌ నుంచి అయోధ్యకు ప్రత్యేక రైలు.. సమయ వేళలు ఇవే..
Indian Railways
Follow us
Subhash Goud

|

Updated on: Jan 13, 2024 | 1:36 PM

భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ అయిన ఇండియన్‌ రైల్వే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొత్త కొత్త రైళ్లను సైతం నడుపుతోంది. ఎప్పటికప్పుడు కొత్త రైళ్లను అందుబాటులోకి తీసుకురావడం, కొత్త ట్రాక్స్‌ వేయడం, అలాగే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక ఈనెల 22వ తేదీన అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరుగనుంది. ఇందు కోసం దేశ వ్యాప్తంగా చాలా మంది అయోధ్యకు తరలి వెళ్తున్నారు. మున్ముందు కూడా భక్తుల సంఖ్య భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంటోంది.

అయోధ్యకు వెళ్లే వారి కోసం ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రామమందిర్ దర్శనానికి వెళ్తున్న ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రతి శుక్రవారం రైలు సదుపాయం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈనెల 22వ తేదీన అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవం జరుగనున్న నేపథ్యంలో యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్ (నెంబర్ 15024) ఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి గురువారం రాత్రి 11.40 గంటలకు యశ్వంత్‌ పూర్‌లో బయలుదేరి శుక్రవారం ఉదయం 10.40 గంటలకు కాచిగూడ రైల్వేస్టేషన్ చేరుకుంటుంది.

10.50 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి కాజీపేట, బలార్షా, నాగాపూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్, లక్నో మీదుగా శనివారం సాయంత్రం 4.25 గంటలకు అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ చేరు కుంటుంది. అక్కడి నుంచి గోరఖ్‌పూర్ వెళుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
ఉదయం ఉల్లిదోశ, రాత్రి బిర్యానీ.. హైదరాబాదీల ఫుడ్ ఆర్డర్ల లిస్టు..
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
వేగంగా పరుగులు పెడుతున్న రియల్ ఎస్టేట్ రంగం..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!
రవి అనుగ్రహం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు, విజయాలు..!