No Income Tax: ఈ రాష్ట్ర ప్రజలు ఆదాయపు పన్ను అస్సులు చెల్లించరు.. కారణం ఏంటో తెలుసా?

దేశంలో ఎక్కడ చూసినా ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే. అందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఉంది. పౌరులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఆదాయపు పన్ను చెల్లించాలి. భారతదేశంలోని ఈ రాష్ట్ర పౌరులలో 95 శాతం మంది తమ కోట్ల ఆదాయంపై ఒక్క పైసా కూడా పన్నుల రూపంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రం ఏదో తెలుసా? సిక్కిం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇక్కడి స్థానికులకు ఆదాయపు..

No Income Tax: ఈ రాష్ట్ర ప్రజలు ఆదాయపు పన్ను అస్సులు చెల్లించరు.. కారణం ఏంటో తెలుసా?
Income Tax
Follow us
Subhash Goud

|

Updated on: Jan 13, 2024 | 8:24 AM

దేశంలో ఆదాయపు పన్నును తగ్గించుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. దేశానికి కూడా ట్యాక్స్‌ రూపంలో ఎంతో ఆదాయం చేకూరుతోంది. కొఓత్త పన్ను విధానంలో పన్ను చెల్లింపుదారులు ఏడు లక్షల రూపాయల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. భారతీయ పౌరుడు స్థిర ఆదాయంపై పన్ను చెల్లిస్తాడు. దేశంలో ఎక్కడ చూసినా ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే. అందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఉంది. పౌరులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఆదాయపు పన్ను చెల్లించాలి. భారతదేశంలోని ఈ రాష్ట్ర పౌరులలో 95 శాతం మంది తమ కోట్ల ఆదాయంపై ఒక్క పైసా కూడా పన్నుల రూపంలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆ రాష్ట్రం ఏదో తెలుసా? సిక్కిం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇక్కడి స్థానికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా

రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం.. తూర్పు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా వచ్చింది. ఇండియన్ యూనియన్‌లో విలీన సమయంలో ఈ రాష్ట్ర ప్రజలకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు. అందుకే ఇక్కడ ఆదాయపు పన్ను రహితమైనవి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371ఎ ప్రకారం ప్రత్యేక రాష్ట్ర హోదా వచ్చింది. ఇతర పౌరులు ఈ రాష్ట్రంలో ఆస్తిని కొనుగోలు చేయలేరు. ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 10 (26AAA) ప్రకారం స్థానికులు ఆదాయపు పన్ను మినహాయింపు పొందుతారు.

1975లో సిక్కిం విలీనం

సిక్కిం 1642లో స్థాపన జరిగింది. 1975లో ఈ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. 1950లో భారత్-సిక్కిం శాంతి ఒప్పందం కుదిరింది. 1948లో సిక్కింలోని చోగ్యాల్ పాలకులు దేశంలో ఆదాయపు పన్ను చెల్లించకూడదని నిర్ణయించుకున్నారు. భారత్‌తో విలీన సమయంలో ఈ షరతు అలాగే ఉండిపోయింది. భారతీయ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 10 (26AAA) ప్రకారం స్థానిక పౌరులకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు ఉంది.

పాన్ కార్డ్ లేకుండా లావాదేవీలు

ఆదాయపు పన్ను మినహాయింపుతో పాటు, మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కూడా సిక్కిం పౌరులకు పాన్ కార్డు వినియోగానికి సంబంధించి మినహాయింపు ఇచ్చింది. భారతదేశంలోని ఇతర రాష్ట్రాల ప్రజలు స్టాక్ మార్కెట్ లేదా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టడానికి పాన్ కార్డ్ అవసరం. సిక్కిం పౌరులు పాన్ కార్డ్ లేకుండా స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి