Multibagger Stock: ఆ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వారి పంట పండినట్లే.. మూడేళ్లలో షాకింగ్ రాబడి
స్టాక్స్‌లో ఓ కంపెనీ ఏకంగా మూడేళ్లల్లో 535 శాతం రాబడినిచ్చింది. మూడు సంవత్సరాల క్రితం ఒక్కొక్కటి రూ.1,083 ట్రేడింగ్ ధర నుంచి ప్రస్తుత ట్రేడింగ్ ధర ఒక్కొక్కటి రూ. 6,875కి ఆకాశాన్ని తాకాయి. అంటే ఈ కంపెనీ వారి వాటాదారులకు 535 శాతం భారీ రాబడిని అందించింది. ఈ మూడేళ్ల వ్యవధిలో సోలార్ ఇండస్ట్రీస్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే రూ.6.30 లక్షలకు చేరింది. ఈ వృద్ధి సోలార్ ఇండస్ట్రీస్‌ను ఈక్విటీ మార్కెట్లలో స్టాండ్ అవుట్ పెర్ఫార్మర్స్‌లో ఒకటిగా నిలిపింది.ఈ కాలంలో స్టాక్ నిలకడగా చెప్పుకోదగిన లాభాలను ప్రదర్శించింది.
ధనం మూలం ఇదం జగత్.. అంటే డబ్బు ఆధారంగానే సమాజంలో హోదా దక్కుతుందని అర్థం. అందువల్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందరూ పొదుపు వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే స్థిరమైన ఆదాయం కాకుండా కొంచెం రిస్క్ చేసి అయినా మంచి ఆదాయం పొందాలనేకునే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతున్నారు. ఇలా స్టాక్స్‌లో ఓ కంపెనీ ఏకంగా మూడేళ్లల్లో 535 శాతం రాబడినిచ్చింది. మూడు సంవత్సరాల క్రితం ఒక్కొక్కటి రూ.1,083 ట్రేడింగ్ ధర నుంచి ప్రస్తుత ట్రేడింగ్ ధర ఒక్కొక్కటి రూ. 6,875కి ఆకాశాన్ని తాకాయి. అంటే ఈ కంపెనీ వారి వాటాదారులకు 535 శాతం భారీ రాబడిని అందించింది. ఈ మూడేళ్ల వ్యవధిలో సోలార్ ఇండస్ట్రీస్‌లో రూ.1 లక్ష పెట్టుబడి పెడితే రూ.6.30 లక్షలకు చేరింది. ఈ వృద్ధి సోలార్ ఇండస్ట్రీస్‌ను ఈక్విటీ మార్కెట్లలో స్టాండ్ అవుట్ పెర్ఫార్మర్స్‌లో ఒకటిగా నిలిపింది.ఈ కాలంలో స్టాక్ నిలకడగా చెప్పుకోదగిన లాభాలను ప్రదర్శించింది. ఈ కంపెనీ 2021 క్యాలెండర్ సంవత్సరంలో ఇది 122 శాతం మల్టీ-బ్యాగర్ రాబడిని అందించింది. ఆ తర్వాతి సంవత్సరంలో 83 శాతం అందించింది. 2023 క్యాలెండర్ సంవత్సరంలో స్టాక్ 54 శాతం గణనీయమైన లాభాలను జోడించింది. కాబట్టి ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
సోలార్ ఇండస్ట్రీస్ పారిశ్రామిక పేలుడు పదార్థాలు, ఉపకరణాల తయారీ, సరఫరా వ్యాపారంలో చేస్తుంటుంది. ఇది ప్రధానంగా మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిఫెన్స్ వంటి రంగాలకు సేవలు అందిస్తుంది. సంస్థ అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ కంపెనీ ఉత్పత్తులపై మంచి డిమాండ్ ఉండడంతో వివిధ దేశాలకు దాని ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది. జనవరి 09న కంపెనీ రక్షణ వ్యాపారంలో రూ.9.94 బిలియన్ల విలువైన ఎగుమతి ఆర్డర్‌లను పొందింది. మూడు సంవత్సరాల డెలివరీ వ్యవధితో అంతర్జాతీయ క్లయింట్‌కు రక్షణ ఆధారిత అప్లికేషన్ కోసం ఉత్పత్తుల సరఫరా చేయాల్సి ఉంటుంది. గత ఏడాది సెప్టెంబరులో అందుకున్న రు.3 బిలియన్ల పినాకా ఎగుమతి ఆర్డర్ తర్వాత ఇటీవలి సంవత్సరాలలో ఇది రెండవ అతిపెద్ద రక్షణ ఎగుమతి ఆర్డర్ . ప్రస్తుత ఎగుమతి ఆర్డర్ విలువ రూ.9.94 బిలియన్లు. అలాగే క్యూ2 ఎఫ్వై 24 నాటికి సాయిల్‌కు సంబంధించిన డిఫెన్స్ ఆర్డర్ బుక్ రూ.10.5 బిలియన్లకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణుల చెబుతున్నారు.
రక్షణ పోర్ట్‌ఫోలియో విస్తరణ
సోలార్ ఇండస్ట్రీస్ డిఫెన్స్ పోర్ట్‌ఫోలియోను దీర్ఘకాలిక వృద్ధికి, లాభదాయకతకు కీలకమైన డ్రైవర్‌గా విస్తరిస్తోంది. పారిశ్రామిక పేలుడు పదార్థాల పరిమాణంలో 15-20 శాతం పెరుగుదల, రక్షణ విక్రయాలను వ్యూహాత్మకంగా పెంచడం ద్వారా ఎఫ్‌వై23-26 ఈ ఈ బ్రోకరేజ్ 25 శాతమని అంచనా వేసింది. అలాగే ఈ కంపెనీ రక్షణ అమ్మకాలు ఎఫ్‌వై 23లో రూ.4 బిలియన్ల నుంచి ఎఫ్‌వై24ఈలో రూ.7 బిలియన్లకు పెరుగుతాయని పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. అలాగే ఎఫ్‌వై 25, 26ఈ కంటే రక్షణ అమ్మకాలు 12 బిలియన్లు నుంచి 15.4 బిలియన్లకు చేరుకుంటాయని ఇదిపేర్కొంటున్నాయి. ఇది ఎఫ్‌వై 25 ఈ , ఎఫ్‌వై 26ఈలో వరుసగా 14.4 శాతం, 16.1 శాతం ఏకీకృత విక్రయాలను కలిగి ఉంటుంది. అదనంగా, రక్షణ అమ్మకాలు ఈబీటీడీఏకు మరింత పెద్ద వాటాను అందించే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..