Co-Branded Credit Cards: కో- బ్రాండెడ్ కార్డులు అంటే ఏమిటి? ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయి

నిర్దిష్ట వ్యాపార సంస్థలు లేదా అవుట్ లెట్స్ వద్ద నిరంతర కొనుగోళ్లపై కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు, ఇంధన కొనుగోలుపై ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లను అందించే కో-బ్రాండెడ్ కార్డులను వినియోగించినట్లైతే, మీరు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. వస్తువులను, సర్వీసులను కొనుగోలు చేయడానికి మీరు రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయవచ్చు. ఈఎంఐ ద్వారా కొనుగోళ్ళు చేయడం, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్

Co-Branded Credit Cards: కో- బ్రాండెడ్ కార్డులు అంటే ఏమిటి? ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయి
Co Branded Credit Cards
Follow us
Subhash Goud

|

Updated on: Jan 12, 2024 | 12:17 PM

ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డుల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. రకరకాల క్రెడిట్‌ కార్డులు అందుబాటులోకి తీసుకువస్తున్నాయి బ్యాంకులు. రకరకాల ఆఫర్లతో క్రెడిట్‌ కార్డులు జారీ చేస్తుండటంతో వినియోగం కూడా చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరి జేబులో క్రెడిట్‌ కార్డులు ఉంటున్నాయి. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతున్నారు. గతంతో పోలిస్తే.. వ్యక్తిగత అవసరాలకూ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అందుకే కో-బ్రాండెడ్‌ కార్డులు ఇప్పుడు ఎంతో ఆదరణ పొంతున్నాయి. ఈ నేపథ్యంలో మరి కో-బ్రాండెట్‌ కార్డుల వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

మన దేశంలో దాదాపు 9.4 కోట్ల క్రియాశీల క్రెడిట్‌ కార్డులు ఉన్నాయని, ఈ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే క్రెడిట్‌ కార్డు వినియోగదారులూ, బ్రాండ్ల మధ్య ఒక బలమైన వ్యాపార భాగస్వామ్యాన్ని సృష్టించేందుకు కో-బ్రాండ్‌ కార్డులు ఎంతగానో దోహదం చేస్తాయి. మీరూ కొత్తగా కో-బ్రాండెడ్‌ కార్డు కోసం చూస్తుంటే.. వీటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

మరి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డలు అంటే ఏమిటి?

ఇవి కూడా చదవండి

కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లు అనేది ఒక రిటైలర్ లేదా బ్రాండ్ క్రెడిట్ కార్డ్ జారీదారుతో భాగస్వామ్యంతో అందించే చెల్లింపు ఎంపిక. ఈ కార్డ్‌లు రెండు కంపెనీల లోగోలను కలిగి ఉంటాయి. అలాగే వినియోగదారులకు పెద్ద తగ్గింపులను అందించగలవు. ఇవి క్రెడిట్ కార్డు కంపెనీల ద్వారా రూపొందించి ఉంటాయి. ఉదాహరణకు ఎయిర్ లైన్ కంపెనీలు, బ్యాంకులు అందించే హై ఫ్లయర్ కార్డుల ద్వారా విమాన టిక్కెట్లను బుక్ చేసినట్లయితే, అవి అదనపు డిస్కౌంట్ తో పాటు, ఎక్కువ మొత్తంలో రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను నిరంతరం వినియోగించడం ద్వారా ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్లను పొందవచ్చు. ఒకవేళ మీరు ఒక స్టోర్ లేదా బ్రాండు కు నమ్మకమైన వినియోగదారులు అయినట్లయితే, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను ఎంపిక చేసుకోవడం మంచిది.

కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు

నిర్దిష్ట వ్యాపార సంస్థలు లేదా అవుట్ లెట్స్ వద్ద నిరంతర కొనుగోళ్లపై కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఇంధన ధరలు విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు, ఇంధన కొనుగోలుపై ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్లు, డిస్కౌంట్లను అందించే కో-బ్రాండెడ్ కార్డులను వినియోగించినట్లైతే, మీరు దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. వస్తువులను, సర్వీసులను కొనుగోలు చేయడానికి మీరు రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేయవచ్చు. ఈఎంఐ ద్వారా కొనుగోళ్ళు చేయడం, తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్ రుసుముపై తగ్గింపు వంటి ప్రయోజనాలను ఈ కార్డులు మీకు అందిస్తాయి.

ఈ కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులు ఎవరు ఎంచుకోవాలి?

ఒకవేళ మీ కొనుగోళ్లు కేవలం ఒక బ్రాండ్ కు పరిమితం కానట్లయితే, కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు మీకు ఎలాంటి అదనపు ప్రయోజనాలను అందించకపోవచ్చు. మరోవైపు, ఒకవేళ మీరు ఒక నిర్దిష్ట బ్రాండ్ ను తరచుగా కొనుగోళ్లు చేస్తున్నట్లైతే, అప్పుడు మీరు ఇతర వినియోగదారుల కంటే అదనపు రివార్డ్ పాయింట్లతో పాటు, డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ కార్డులకు జాయినింగ్ ఫీజు, వార్షిక ఫీజులు వర్తిస్తాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి