AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Close SBI Account : మీరు మీ బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయాలనుకుంటున్నారా..! అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులువుగా చేయండి..

Close SBI Account : ఎస్బిఐ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. ఈ బ్యాంకులో

Close SBI Account : మీరు మీ బ్యాంక్ ఖాతాను క్లోజ్ చేయాలనుకుంటున్నారా..! అయితే ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే సులువుగా చేయండి..
Sbi
uppula Raju
|

Updated on: Jun 07, 2021 | 7:03 PM

Share

Close SBI Account : ఎస్బిఐ లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు. ఈ బ్యాంకులో 22 వేలకు పైగా శాఖలు ఉన్నాయి. 58 వేలకు పైగా ఎటిఎంలు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఎస్బిఐ తన వినియోగదారులకు వివిధ బ్యాంకింగ్ సౌకర్యాలను అందిస్తుంది. మీరు ఎస్బిఐ కస్టమర్‌గా సంతోషంగా లేకుంటే మీరు మీ ఖాతాను మూసివేయవచ్చు. ఖాతా మూసివేత సౌకర్యం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంది. ఏదేమైనా ఖాతాను మూసివేయడానికి కస్టమర్ అభ్యర్థనను హార్డ్ కాపీలో బ్యాంక్ శాఖకు సమర్పించాలి. ఈ లేఖలో ఖాతా మూసివేయాలని కారణాలను వివరించాలి.

మీ బ్యాంకింగ్ శాఖతో మీరు సంతోషంగా లేకుంటే బ్రాంచ్‌ను సందర్శించడంలో అసౌకర్యంగా ఉంటే మీరు ఖాతాను ఇతర శాఖలకు కూడా బదిలీ చేసుకోవచ్చు. మీరు ఈ పనిని ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. బ్రాంచ్‌కు వెళ్లడం కంటే ఆన్‌లైన్ మాధ్యమాన్ని ఇందుకోసం ఉపయోగించవచ్చని బ్యాంక్ అధికారులు తెలిపారు. స్టేట్ బ్యాంక్ ప్రకారం.. వినియోగదారులు ఖాతాలను బదిలీ చేయడానికి YONO SBI, YONA Lite, Online SBI ఛానెల్‌లను ఉపయోగించవచ్చు. వినియోగదారులు తమ మొబైల్ లేదా కంప్యూటర్‌లో ఇంట్లో కూర్చున్న ఈ ఆన్‌లైన్ సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. అవసరమైన సమాచారం ఇవ్వడం ద్వారా, మీరు ఇంట్లో కూర్చొనే మీ శాఖను మార్చుకోవచ్చు.

ఖాతాను మూసివేసే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి.. 1. మీ ఖాతా నుంచి అన్ని స్వయంచాలక చెల్లింపు లింక్‌లను రద్దు చేయాలి. 2. ఖాతా మూసివేయడానికి ముందు అన్ని బ్యాంక్ బకాయిలను చెల్లించాలి. 3. ఖాతాను మూసివేసే ముందు మీ వద్ద పొదుపు ఖాతా స్టేట్మెంట్ ఉందని నిర్ధారించుకోవాలి. 4. ఖాతాను మూసివేసే ముందు మీ ఖాతా బ్యాలెన్స్ సున్నాగా ఉండాలి. 5. ఖాతాను మూసివేసిన తర్వాత మీ ఖాతాను ఎస్‌బిఐలో తిరిగి తెరవలేరు.

ఆన్‌లైన్ ఖాతాను ఎలా మూసివేయాలి.. ఎస్బిఐ ఖాతాను మూసివేయడానికి లేదా నిష్క్రియం చేయడానికి ముందు కస్టమర్ ఖాతా మూసివేత ఫారమ్ నింపాలి. ఇంటి శాఖను సందర్శించడం ద్వారా మీరు ఈ పని చేయవచ్చు. లేదా మీరు ఎస్బిఐ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా మూసివేత ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత సరిగ్గా పూర్తిగా నింపండి. ఫారమ్ నింపిన తరువాత మీ శాఖకు సమర్పించండి. ఫారమ్ నింపేటప్పుడు మీరు ఈ సమాచారాన్ని అందించాలి.

ఖాతాదారుని పేరు, ఖాతా సంఖ్య, ఖాతాదారుడి సంతకం, నగరం, రాష్ట్రం, పిన్ కోడ్, ఖాతా మూసివేయడానికి కారణం, బ్యాలెన్స్ మొత్తం ఏ ఖాతాకు బదిలీ చేయబడుతుంది (చెక్, నగదు లేదా డిడి వివరాలు), మూసివేత ఫారమ్‌ను బ్యాంక్ బ్రాంచ్‌లో సమర్పించిన తరువాత కస్టమర్ పాస్‌బుక్, చెక్ బుక్, బ్యాంక్ డెబిట్ కార్డును తిరిగి ఇవ్వాలి. మూసివేత ఫారమ్‌ను సమర్పించేటప్పుడు బ్యాంక్ అధికారులు కస్టమర్ నుంచి చిరునామా రుజువును కూడా అడగవచ్చు. మీరు మూసివేత రూపంలో అన్ని వివరాలను సరిగ్గా ఇచ్చినట్లయితే బ్యాంక్ అధికారులు ధృవీకరిస్తారు. ఆ తర్వాత వారు బ్యాంకు ఖాతాను మూసివేస్తారు. ఖాతా మూసివేయబడిన తర్వాత మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌లో SMS సందేశాన్ని పంపిస్తారు.

ఖాతా మూసివేత రుసుము.. ఎస్‌బిఐ ప్రకారం ఖాతాదారుడు ఖాతా తెరిచిన 14 రోజుల్లోపు దాన్ని మూసివేస్తే దానికి ఎటువంటి ఛార్జీ ఉండదు. అయితే ఖాతా మూసివేయడానికి రూ.500 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎస్బిఐ ఖాతా తెరిచిన తేదీ నుంచి 14 రోజుల నుంచి 1 సంవత్సరం లోపల మూసివేయబడితే దీని కోసం రూ.500 ప్లస్ గ్యాట్ చెల్లించాలి. మీరు సాధారణ పొదుపు ఖాతాను మూసివేస్తే దీని కోసం ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఎస్‌బిఐకి సంబంధించిన సమాచారం కోసం కస్టమర్ లేదా సాధారణ వ్యక్తి టోల్ ఫ్రీ నంబర్ 1800 425 3800 కు కాల్ చేయవచ్చు.

Chandrababu Meet Seethakka : సీతక్క తల్లిని పరామర్శించిన చంద్రబాబు నాయుడు.. థ్యాంక్స్ అన్నా అంటూ కంటతడి పెట్టిన ఎమ్మెల్యే..

Megastar Chiranjeevi: రోజుకు ఐదారు వందల మంది సినీ కార్మికులకు వాక్సిన్ ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నాము : చిరంజీవి

Mrigasira Karthi Fish: మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?.. అసలు కారణం ఏమిటి..?