Gold and Silver Price: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. రూ.60 వేలకు చేరుకునే అవకాశం.. కారణాలేంటి..?

Gold and Silver Price: దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. దేశంలో మూడు వారాలుగా కోలుకుంటున్నట్లు కనిపిస్తున్న స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మరింతగా దూసుకెళ్లే..

Gold and Silver Price: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు.. రూ.60 వేలకు చేరుకునే అవకాశం.. కారణాలేంటి..?
Gold And Silver
Follow us
Subhash Goud

|

Updated on: Jun 07, 2021 | 3:32 PM

Gold and Silver Price: దేశంలో బంగారం ధర పరుగులు పెడుతోంది. దేశంలో మూడు వారాలుగా కోలుకుంటున్నట్లు కనిపిస్తున్న స్టాక్‌ మార్కెట్లు ఈ వారం మరింతగా దూసుకెళ్లే అవకాశాలున్నాయని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. దేశంలో కరోనా తగ్గుతోంది. అలాగే.. నైరుతి రుతుపవనాలు సమయం వచ్చేశాయి. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లలోకి వస్తున్నాయి. అందువల్ల మళ్లీ సూచీలు పరుగులు పెడతాయని అంటున్నారు. ఇదే కారణం వల్ల బంగారం, వెండి ధరలు కూడా పెరుగుతాయని వ్యాపార వేత్తలు పేర్కొంటున్నారు. అలాగే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారానికి ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఈ కారణంగా కూడా బంగారం ధరలు పెరుగుతూ… చివరకు ఆగస్టు నాటికి రూ.60 వేల వరకు చేరే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

రూ.50వేలు దాటేశాయి:

మార్చి నెల 31న 22 క్యారెట్ల నగల బంగారం ధర రూ.41,100 ఉంది. ఇప్పుడు (సోమవారం నాటికి)… రూ.47,510 ఉంది. 67 రోజుల్లో ధర రూ.6,410 పెరిగింది. అలాగే.. 24 క్యారెట్ల నగల బంగారం 10 గ్రాములు మార్చి 31న రూ.44,840 ఉండగా… ఇప్పుడు రూ.52,300 ఉంది. అంటే 67 రోజుల్లో ధర రూ.7,460 పెరిగింది. ప్రస్తుతం (సోమవారం) మధ్యాహ్నం నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950, అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,300 ఉంది. అంటే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా, తక్కువగా రేట్లు ఉన్నాయి.

ఇక గత10 రోజుల్లో బంగారం ధర 7 సార్లు పెరుగగా, రెండు సార్లు తగ్గింది. ఒకసారి స్థిరంగా ఉంది. నిన్న ధర కొద్దిగా పెరిగింది. ప్రస్తుతం చూస్తు తగ్గుదల ఉంది. అయితే నగల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర సోమవారం మధ్యాహ్నం నాటికి రూ.4,751 ఉంది. వెండి ధరలు గత 10 రోజుల్లో 6 సార్లు పెరగగా… 3 సార్లు తగ్గాయి. 1 సారి స్థిరంగా ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం నాటికి దేశీయంగా కిలో వెండి ధర రూ. 71 వేలు ఉంది. మరి కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉంది.

పెట్టుబడులకు అవకాశం:

బంగారంపై పెట్టుబడి పెట్టాలి అనుకునేవారికి ఇదే చివరి అవకాశమని అంటున్నారు బులికయన్‌ మార్కెట్‌ నిపుణులు. ఇప్పుడు గానీ పెట్టుబడి పెట్టకపోతే… భవిష్యత్తులో పెట్టినా… పెద్దగా రిటర్నులు వచ్చే అవకాశాలు ఉండవంటున్నారు. ఇప్పుడు రూ.50వేల వరకు ఉంది కాబట్టి.. ఇప్పుడు పెట్టుబడి పెడితే.. రూ.60వేలకు చెరినట్లయితే.. అప్పుడు 20 శాతం రిటర్నులు పొందినట్లు అవుతుంది అంటున్నారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.