Indian Railways: ఫ్లాట్‌ఫామ్ టికెట్ వ్యాలిడిటీ ఎంత సేపు ఉంటుంది.? ఇదిగో వివరాలు..
ఇక దేశంలో చాలా రైల్వే స్టేషన్స్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్స్ విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్స్‌లో ప్రయాణికుల రద్దీని క్రమబద్దీకరించే క్రమంలో ఈ ప్లాట్‌ఫామ్ టికెట్ విధానాన్ని అమలు చేస్తుంటారు. దీంతో కేవలం అవసరమైన వారు మాత్రమే రైల్వేస్టేషన్స్‌లోకి వస్తారనేది అధికారుల ఉద్దేశం. అయితే...

ప్రపంచంలో అతిపెద్ద ప్రయాణ నెట్‌వర్క్స్‌లో ఇండియన్ రైల్వే ఒకటి. ప్రతీ రోజూ లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తుంది. లక్షలాది మంది ఉద్యోగులు, వేలాది రైల్వే స్టేషన్స్‌తో సేవలు అందిస్తోన్న రైల్వేకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి.
ఇక దేశంలో చాలా రైల్వే స్టేషన్స్‌లో ప్లాట్‌ఫామ్ టికెట్స్ విధానం అమల్లో ఉన్న విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్స్‌లో ప్రయాణికుల రద్దీని క్రమబద్దీకరించే క్రమంలో ఈ ప్లాట్‌ఫామ్ టికెట్ విధానాన్ని అమలు చేస్తుంటారు. దీంతో కేవలం అవసరమైన వారు మాత్రమే రైల్వేస్టేషన్స్‌లోకి వస్తారనేది అధికారుల ఉద్దేశం. అయితే రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ వ్యాలిడిటీ ఎంత సేపు ఉంటుంది.? ఈ టికెట్ కొనుగోలు చేస్తే రైల్వే స్టేషన్‌లో ఎంత సేపు ఉండొచ్చు.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రైల్వే ప్లాట్‌ఫామ్ టికెట్ వ్యాలిడిటీ కేవలం 2 గంటలు మాత్రమే ఉంటుంది. టికెట్ కొనుగోలు చేసిన తర్వాత 2 గంటల్లోపు స్టేషన్ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ సేపు ఉన్నా, అసలు టికెట్ తీసుకోకపోయినా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ప్లాట్‌ఫామ్ టికెట్ ధర విషయానికొస్తే సదరు రైల్వే స్టేషన్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ప్లాట్‌ఫామ్ టికెట్ ధర గరిష్టంగా రూ. 50 వరకు ఉంటుంది.
ఇదిలా ఉంటే.. వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు, పోస్టల్ సర్వీస్ రైల్వే శాఖ, పోలీస్ శాఖ, ఎన్సిసి, రైల్వే కాంట్రాక్టర్లకు ఉచిత పాసులు ఉంటాయి. వీరు ఎంతసేపైనా రైల్వే స్టేషన్‌లో ఉండొచ్చు. ఒకవేళ ప్లాట్‌ఫామ్ టికెట్ లేకుండా ఎవరైనా రైల్వే స్టేషన్‌లోకి వచ్చి, తనిఖీ సిబ్బందికి దొరికిపోతే రూ. 250 నుంచి రూ. 500 వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ 2 గంటల సమయం ముగిసిపోతే మళ్లీ కొత్త టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..




