New SEBI Rule: కొత్తగా మారిన సెబీ రూలెంటో తెలుసా? పిల్లల పేరిట పెట్టుబడి పెట్టేవారికి ఆ కష్టాలకు చెక్..
మార్కెట్ రిస్క్‌ల గురించి ఆలోచించడం మానేస్తే మ్యూచువల్ ఫండ్స్‌కు మించిన పెట్టుబడి సాధనం మరోకటి ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడిదారులు మంచి లాభాలు ఆర్జించవచ్చని చాలా మంది మార్కెట్ రంగ నిపుణులు చెబుతూ ఉంటాయి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్నపిల్లల పేరిట పెట్టుబడి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరిట జాయింట్ ఎకౌంట్ తీసుకోవడం దాన్ని నిర్వహించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.
పిల్లల బంగారు భవిష్యత్ కోసం ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు. ముఖ్యంగా వారిని బాగా చదివించి ఉన్నత స్థానాల్లో ఉంచాలని నిత్యం కష్టపడుతూ ఉంటారు. వారి ఉన్నత చదువులకు చిన్నతనం నుంచే పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇప్పుడు చేసిన పొదుపు వారికి తగిన వయస్సు వచ్చాక ఉన్నత చదువులకు ఉపయోగపడతాయని వివిధ సాధనాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఇలాంటి వారు మంచి రాబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ వైపు చూస్తూ ఉంటారు. మార్కెట్ రిస్క్‌ల గురించి ఆలోచించడం మానేస్తే మ్యూచువల్ ఫండ్స్‌కు మించిన పెట్టుబడి సాధనం మరోకటి ఉండదు. మ్యూచువల్ ఫండ్స్ ద్వారా పెట్టుబడిదారులు మంచి లాభాలు ఆర్జించవచ్చని చాలా మంది మార్కెట్ రంగ నిపుణులు చెబుతూ ఉంటాయి. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్నపిల్లల పేరిట పెట్టుబడి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే చిన్నపిల్లలు, తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరిట జాయింట్ ఎకౌంట్ తీసుకోవడం దాన్ని నిర్వహించడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అయితే తాజాగా సెబీ తాజా సర్క్యులర్‌లో ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేలా నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు తమ పిల్లల కోసం మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో తమ సొంత బ్యాంకు ఖాతాల నుంచి త్వరలో పెట్టుబడి పెట్టవచ్చు.
మే 12న రిలీజ్ చేసిన కొత్త సెబీ సర్క్యులర్ ప్రకారం, ఈ ప్రయోజనం కోసం వారు ఇకపై జాయింట్ ఖాతాలు తెరవడం లేదా మైనర్ పిల్లల ఖాతాను తెరవాల్సిన అవసరం లేదు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఒక సంరక్షకుని ద్వారా మైనర్ పేరుతో చేసిన పెట్టుబడులకు సంబంధించి అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలన్నీ ఏకరీతి ప్రక్రియను అనుసరించాలని సూచించింది .ఏదైనా మోడ్ ద్వారా పెట్టుబడి కోసం చెల్లింపు మైనర్, తల్లిదండ్రులు లేదా మైనర్‌కు సంబంధించిన చట్టపరమైన సంరక్షకుల బ్యాంక్ ఖాతా నుంచి లేదా మైనర్ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుల ఉమ్మడి ఖాతా నుంచి అంగీకరించాలని సెబీ తాజా సర్క్యూలర్‌లో సూచించింది. ఇప్పటికే ఉన్న ఫోలియోల కోసం ఏఎంసీలు రిడెంప్షన్ ప్రాసెస్ చేయడానికి ముందు పే-అవుట్ బ్యాంక్ ఆదేశాన్ని మార్చాలని పట్టుబట్టాలని కూడా సెబీ తెలిపింది.
తాజా సెబీ సర్క్యులర్ ప్రకారం మైనర్ పేరుతో చేసిన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ల నుంచి అన్ని లాభనష్టాలు కేవలం మైనర్ ధ్రువీకరించిన బ్యాంక్ ఖాతాకు మాత్రమే జమవుతాయి. ముఖ్యంగా సబ్‌స్క్రిప్షన్ చెల్లింపు మూలంతో సంబంధం లేకుండా ఈ విధంగానే ప్రాసెస్ అవుతుంది. రెగ్యులేటర్ ప్రకారం, 2019 సర్క్యులర్‌లో పేర్కొన్న అన్ని ఇతర నిబంధనలు మారవు. అలాగే ఈ కొత్త నియమం జూన్ 15, 2023 నుంచి అమల్లోకి వస్తుందని తాజా సర్క్యూలర్‌లో పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి