AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: క్యాన్సల్‌ చేయాలనుకున్న రైలు టికెట్‌ను వేరే వాళ్లకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని తెలుసా.?

అయితే టికెట్ క్యాన్సిల్‌ చేసుకోవడం వల్ల మనం చెల్లించిన దానికంటే కొంత డబ్బు కోల్పోవాల్సి వస్తుంది. అయితే టికెట్‌ను క్యాన్సల్ చేయకుండా ఇతరుకుల ట్రాన్స్‌ఫర్‌ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ! ఇలాంటి ఓ అవకాశాన్నే తీసుకొచ్చింది ఇండియన్‌ రైల్వే. టికెట్‌ను క్యాన్సిల్‌ చేయకుండా ఇతరులకు బదిలీ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ తీసుకొచ్చింది. అయితే టికెట్‌ను కేవలం...

Indian Railways: క్యాన్సల్‌ చేయాలనుకున్న రైలు టికెట్‌ను వేరే వాళ్లకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చని తెలుసా.?
Indian Railways
Narender Vaitla
|

Updated on: Oct 14, 2023 | 3:50 PM

Share

రైలు ప్రయాణం అంటేనే ఎన్నో రోజులు ముందు నుంచే ప్లాన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా పండుగల సమయంలో నెలల ముందుగానే టికెట్‌ను బుక్‌ చేసుకుంటారు. అయితే తీరా ప్రయాణ సమయానికి అనుకోని పరిస్థితుల్లో ప్రయాణం వాయిదా వేసుకోవాల్సి వస్తే ఏం చేస్తారు. ఏముంది టికెట్‌ను క్యాన్సిల్‌ చేసుకోవాల్సిందే అంటారా.?

అయితే టికెట్ క్యాన్సిల్‌ చేసుకోవడం వల్ల మనం చెల్లించిన దానికంటే కొంత డబ్బు కోల్పోవాల్సి వస్తుంది. అయితే టికెట్‌ను క్యాన్సల్ చేయకుండా ఇతరుకుల ట్రాన్స్‌ఫర్‌ చేసే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ! ఇలాంటి ఓ అవకాశాన్నే తీసుకొచ్చింది ఇండియన్‌ రైల్వే. టికెట్‌ను క్యాన్సిల్‌ చేయకుండా ఇతరులకు బదిలీ చేసుకునే సదుపాయాన్ని రైల్వే శాఖ తీసుకొచ్చింది. అయితే టికెట్‌ను కేవలం ఫాదర్‌, మదర్‌, సిస్టర్‌, బ్రదర్‌, కొడుక, కుమార్తె, భర్త లేదా భార్య ఇలా దగ్గరి కుటుంబ సభ్యులకు మాత్రమే ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇంతకీ టికెట్‌ను ఎలా ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలి, ఇందులో ఉండే నిబంధనలు ఏంటంటే..

* రైలు బయలుదేరడానికి కనీసం 24 గంటల ముందు రైల్వే అధికారులకు విషయాన్ని వెల్లడిస్తే టికెట్ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

* టికెట్ కన్ఫర్మ్‌ అయిన వారు మాత్రమే తమ టికెట్‌ను వేరే వాళ్లకు ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.

* ట్రాన్స్‌ఫర్‌ చేసుకున్న టికెట్ ద్వారా ప్రయాణించేవారు తప్పనిసరిగా ప్రభుత్వం జారీ చేసిన ఒక ఐడీ ప్రూఫ్‌ను వెంట తీసుకురావాల్సి ఉంటుంది.

* ఇక టికెట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలనుకుంటే ముందుగా కన్ఫామ్‌ అయిన టికెట్‌ను ప్రింట్ తీసుకోవాలి. అనంతరం ట్రాన్స్‌ఫర్‌ చేయాలనుకుంటున్న వ్యక్తికి సంబంధించిన ఆధార్‌ కార్డు లేదా పాన్‌ కార్డు లేదా ఓటర్‌ ఐడీ ఉండాలి.

* వీటిని తీసుకొని దగ్గరల్లోని ఏదైనా రైల్వే స్టేషన్‌ టికెట్ రిజర్వేషన్‌ కౌంటర్‌కు వెళ్లి. టికెట్ ట్రాన్స్‌ఫర్‌ కోరుతూ రిక్వెస్ట్‌ ఇవ్వాలి. ఐడీ ప్రూఫ్‌లను చెక్‌ చేసిన తర్వాత అధికారులు టికెట్‌ను ట్రాన్స్‌ఫర్ చేస్తారు.

వీరికి కూడా అవకాశం..

ఇక కేవలం సొంత కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా.. మరికొందరికి కూడా రైల్వే శాఖ ఈ అవకాశాన్ని కల్పించింది. ఆన్‌డ్యూటీ మీద ప్రయాణం చేసే ప్రభుత్వ ఉద్యోగులు తమ తోటి ఉద్యోగికి టికెట్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అలాగే విద్యా సంస్థలో చదువుకునే విద్యార్థులు కూడా వేరొక విద్యార్థి పేరు మీద టికెట్‌ను బదిలీ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!