Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UPI పేమెంట్స్ హవా.. డెబిట్ కార్డులను మింగేస్తోంది.. ఈ లెక్కలు చూస్తే వామ్మో అనాల్సిందే..

ఓ ఐదారేళ్ళ క్రితం బ్యాంక్ డెబిట్ కార్డులు విస్తృతంగా వినియోగంలో ఉన్న సమయంలో ఎవరైనా ఆ ఈ ఊపు కొన్నాళ్లే.. ఓ పదేళ్ల తరువాత ఈ డెబిట్ కార్డులు కనిపించవు అని చెబితే.. వాళ్ళను దాదాపుగా అందరూ ఓ పిచ్చోడ్ని చూసినట్టు చూసి ఉంటారు. కానీ.. ఇప్పుడు ఆ మాటలు నిజం అవుతున్నాయి. పదేళ్ల సమయం కూడా పట్టలేదు దీనికి. జస్ట్ మూడేళ్ళలో డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ కి దాదాపు చివరి కాలం వచ్చేసింది.

UPI పేమెంట్స్ హవా.. డెబిట్ కార్డులను మింగేస్తోంది.. ఈ లెక్కలు చూస్తే వామ్మో అనాల్సిందే..
UPI vs Debit card
Follow us
Janardhan Veluru

|

Updated on: Oct 14, 2023 | 3:35 PM

కాలం పరుగులు తీస్తూనే ఉంటుంది. ఆ పరుగులతో పాటు ప్రపంచాన్ని మార్చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాల్లోనూ మార్పులు వస్తూనే ఉంటాయి. అవి మంచికా.. చెడ్డకా అనేది పక్కన పెడితే.. కొన్ని విషయాల్లో వచ్చే మార్పులు ముందుగా ఎవరైనా ఊహించి చెబితే.. చాల్చాల్లే అని అందరూ కొట్టి పారేస్తారు. తరువాత ఆ ఊహలు నిజంగా సాక్షాత్కరించినపుడు అప్పుడే ఆయన చెప్పాడు సుమా అని ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. మన పేమెంట్స్ వ్యవస్థలో వచ్చిన మార్పుల గురించి చెప్పడం కోసమే. ఓ ఐదారేళ్ళ క్రితం బ్యాంక్ డెబిట్ కార్డులు విస్తృతంగా వినియోగంలో ఉన్న సమయంలో ఎవరైనా ఆ ఈ ఊపు కొన్నాళ్లే.. ఓ పదేళ్ల తరువాత ఈ డెబిట్ కార్డులు కనిపించవు అని చెబితే.. వాళ్ళను దాదాపుగా అందరూ ఓ పిచ్చోడ్ని చూసినట్టు చూసి ఉంటారు. కానీ.. ఇప్పుడు ఆ మాటలు నిజం అవుతున్నాయి. పదేళ్ల సమయం కూడా పట్టలేదు దీనికి. జస్ట్ మూడేళ్ళలో డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ కి దాదాపు చివరి కాలం వచ్చేసింది.

అవును.. కోవిడ్ డెబిట్ కార్డులకు దాదాపుగా చెక్ పెట్టేసింది. కోవిడ్ దెబ్బకి ఫిజికల్ కాంటాక్ట్స్ లేకుండా ట్రాన్సాక్షన్స్ జరపడం కోసం UPI విధానాన్ని ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. కరోనా ఎంత వేగంగా వ్యాపించిందో దాదాపు అదే వేగంతో UPI విధానం కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ చేయడంలో ఉన్న తలనొప్పులు UPI విధానం దాదాపుగా చెరిపేసింది. దీంతో ఈ విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనం పేమెంట్స్ చేసే విధానాన్ని సమూలంగా మార్చేసింది. డెబిట్ కార్డుల వినియోగం ఎంత వేగంగా తగ్గిపోతోందో ఈ లెక్కలు చూస్తే అర్ధం అవుతుంది.

RBI – NPCI డేటా ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 7. 2 లక్షల కోట్ల రూపాయల డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇదే సమయంలో ఒక కోటీ 39 లక్షల 20 వేల కోట్ల రూపాయల UPI ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఈ లెక్క  UPI పేమెంట్స్ పరుగును స్పష్టం చేస్తోంది.

ఇంకో లెక్క ఉంది.. ఇది వరల్డ్‌లైన్ తాజా ఇండియా డిజిటల్ పేమెంట్స్ రిపోర్ట్స్ నుంచి వచ్చింది. 2022 ఫస్ట్ హాఫ్ లో 32 బిలియన్ల లావాదేవీలు డెబిట్ కార్డుల ద్వారా జరిగితే.. ఈ ఏడాది అదే సమయానికి 52 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ UPI ద్వారా జరిగాయి. అదేవిధంగా వీటి విలువ కూడా 47% పెరిగి 56,59,000 కోట్ల రూపాయల నుంచి 83,17,000 కోట్ల రూపాయలకు చేరుకుంది.

అదే సమయంలో డెబిట్ కార్డుల విషయానికి వస్తే.. అవి 28% తగ్గాయి. అంటే దాదాపు 1.38 బిలియన్ల ట్రాన్సాక్షన్స్ తగ్గింది. విలువ పరంగా చూస్తే 14% తగ్గి 3,17,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇంకా దీనికి సంబంధించిన మూడేళ్ళ లెక్కలు చూస్తే డెబిట్ కార్డుల కంటే UPI ట్రాన్సాక్షన్స్ ప్రాబల్యం ఎంత వేగంగా దూసుకుపోతుందో స్పష్టంగా అర్ధం అవుతుంది.

జూలై 2020లో, మొత్తం డెబిట్ కార్డ్ ఖర్చులు రూ. 2.81 ట్రిలియన్‌లుగా ఉన్నాయి, జూలై 2023లో రూ. 3.15 ట్రిలియన్లు, ఇది 11.96 శాతం వృద్ధిని ప్రతిబింబిస్తుంది. UPI ఖర్చులు 428 శాతం భారీ వృద్ధిని సాధించాయని రిపోర్టులు చెబుతున్నాయి. అదే సమయంలో రూ. 2.90 ట్రిలియన్ల నుంచి రూ. 15.33 ట్రిలియన్లకు చేరుకుందని డేటా వెల్లడించింది.

ఇంకా సింపుల్ గా చెప్పుకుంటే.. SBI ఎకో రీసెర్చ్ నుంచి ఓ రిపోర్ట్ వచ్చింది. దీని ప్రకారం వ్యక్తి ఒక సంవత్సరం క్రితం సగటున 16 సార్లు ATM ని సందర్శించేవాడు. ఇప్పుడు ఏడాదికి 8 సార్లు మాత్రమే ఏటీఎంల మెట్లు ఎక్కుతున్నాడు. అదీ సంగతి. మార్పు ఒక్కోసారి ఎంత వేగంగా వస్తుందంటే ఒకప్పుడు ఇలా ఉండేదా అనిపించేలా కొత్తగా వచ్చిన విషయం మన తరువాతి తరాలను ఆశ్చర్యాయానికి గురిచేసేంతగా ఉంటుంది. ఇప్పుడు UPI విధానమూ అంతే..

సులభంగా డబ్బులు పంపించే వీలు ఉండడం.. డబ్బును జేబులో పెట్టుకుని తిరిగాల్సిన పని లేకపోవడం.. ఫోన్ చేతిలో ఉంటే చాలు ఏ వస్తువు కొన్నా పెమెంట్ చేసేసే వీలు ఉండడం.. నెట్వర్క్ తో పనిలేకుండా కూడా లావాదేవీలు జరిపే అవకాశం రావడం.. ఇలా ఎన్నో కారణాలు ప్రజలను UPI మీద ప్రేమ పెరిగేలా చేస్తున్నాయి. మరోవైపు బిజినెస్ చేసుకునే వారికీ ఇది ఎంతో చక్కగా మద్దతు ఇస్తోంది. ముఖ్యంగా చిల్లర సమస్య లేకపోవడం ఒక పెద్ద కారణంగా చెప్పవచ్చు.ఆ అందుకోసమే చిరు వ్యాపారులు కూడా ఓ క్యూఆర్ కోడ్ పెట్టుకుని బిజినెస్ నడిపించేస్తున్నారు. అలాగే, UPIపై ఎటువంటి ఫీజులు కొనే వారికీ.. అమ్మేవారికీ కూడా లేకపోవడం కూడా UPI వ్యాప్తి పెరగడానికి కారణంగా చెప్పవచ్చు.

భవిష్యత్ లో కూడా UPI హవా ఇలానే కొనసాగుతుంది. ఏదైనా మార్పు రావచ్చు కానీ.. డెబిట్ కార్డులను తిరిగి ఉపయోగంలోకి తెచ్చే పరిస్థితి మాత్రం రాదనీ సంబంధిత నిపుణులు కచ్చితంగా చెబుతున్నారు.

మరిన్ని బిజినెస్ కథనాలు చదవండి..