ఒక మధ్య తరగతి కుటుంబం మీద GST మార్పుల ప్రభావం అసలెంత?
నెలవారీ ఖర్చుల్లో GST ఆదా ఎంత? ఒక మధ్య తరగతి కుటుంబం మీద GST మార్పుల ప్రభావం అసలెంత? 500 నుంచి 2 వేల వరకూ ఒక సామాన్య కుటుంబానికి ఆదా అవుతోందా? ఎలా...? సబ్బులు, పేస్టులు, పాలు, నెయ్యి, చాక్లెట్లు, బిస్కట్‌లు, స్టేషనరీ, బేకరీ వస్తువుల మీద తగ్గనున్న ధరలు. లగ్జరీలు, SIN వస్తువుల మీద ఖర్చు పెట్టే వాళ్ల నుంచి మాత్రం ముక్కుపిండి వసూలు చేయనున్న నిర్మలమ్మ. ఇంతకీ GST మార్పుల వల్ల లాభమెంత? నష్టమెంత? ఇవన్నీ ఈనెలాఖరున అమల్లోకి వస్తున్నాయా?...

పాప్‌కార్న్ మీద వేసిన జోకులు, అప్పుడు పేలిన మీమ్స్, దేశవ్యాప్తంగా జరిగిన డిస్కషన్.. ఏకంగా ఆర్థికమంత్రినే ఆలోచనలో పడేశాయి. ఉప్పు, వెన్న కలిపిన పేలాలను లూజ్‌గా అమ్మితే 5 శాతం జీఎస్టీ. దాన్నే ప్యాక్ చేసి అమ్మితే 12 శాతం జీఎస్టీ. పాప్‌కార్న్‌కు చక్కెర కలిపి ప్యాక్ చేస్తే 18 శాతం జీఎస్టీ. మరి.. అదే చక్కెర కలిపిన పాప్‌కార్న్‌ను ప్యాక్ చేయకుండా అమ్మితే? దీనికి జీఎస్టీ దగ్గర కూడా నో ఆన్సర్. ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చింది. ఏమాత్రం కన్ఫ్యూజన్ లేకుండా.. రెండే రెండే శ్లాబులు తీసుకొచ్చి దాదాపు 90 శాతానికిపైగా వస్తువుల ధరలను తగ్గించేశారు. పండగ చేస్కో అనే డైలాగ్ వింటుంటాం జనరల్‌గా. ఏం పండగ చేసుకోవాలనే దానికి పర్ఫెక్ట్ మీనింగ్ ఇచ్చింది మోదీ ప్రభుత్వం. కొన్ని సరుకులపై 12 శాతం, 28 శాతం ట్యాక్స్‌లు వేసి మధ్యతరగతిపై ధరాభారం మోపారు ఇన్నాళ్లు. ఇప్పుడు ఆ రెండు పన్నులను పూర్తిగా రద్దు చేసి, కేవలం 5 శాతం, 18 శాతం ట్యాక్స్ శ్లాబులు మాత్రమే ఉంచారు. తగ్గించిన జీఎస్టీ వల్ల పర్టిక్యులర్‌గా ఏమేం సరుకుల ధరలు తగ్గుతాయ్ అని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే.. దాదాపుగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కొనే అన్ని వస్తువుల ధరలూ తగ్గుతాయ్. ఇక నుంచి జేబు నిండా డబ్బు తీసుకెళ్తే.. సంచి నిండా సరుకులు వస్తాయ్. నెలకు కొనే పచారీ సామాన్ల...




