Gold Price Today: రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు.. రూ. 1 లక్షా 10 వేల చేరువలో..
Gold Price Today: బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు..

Gold Price Today: బంగారం ధర పరుగులు పెడుతోంది. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుతో పెరుగుతోంది. ప్రస్తుతం తులం బంగారం ధర కొనాలంటే అన్ని ట్యాక్స్‌లతో కలిపి దాదాపు లక్షా 7 వేలకుపైనే పెట్టుకోవాల్సి ఉంటుంది. బంగారానికి మన భారతీయ సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇక తాజాగా సెప్టెంబర్ 5వ తేదీన దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది. ఇక వెండి విషయానికొస్తే కిలోకు రూ.1 లక్షా 26,900 ఉంది. అదే హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో భారీగా ఉంది. రూ.1 లక్షా 36,900 ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి: Viral Video: ఓరి మీ దుంపతెగ..! రోడ్ల మీద ఆ పనులేంట్రా బాబు..! సింగిల్స్ ఏమైపోవాలి!
1. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,07,000 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
2.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
3. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
4. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
5. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
6. కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.రూ.1,06,850 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.97,940 ఉంది.
ఇది కూడా చదవండి: GST Hiked: సిగరెట్లు, గుట్కా, ఫాస్ట్ ఫుడ్ ప్రియులకు షాకింగ్ న్యూస్.. 40 శాతం పన్ను.. ఇక జేబుకు చిల్లులే..!
ధరలు పెరగడానికి కారణాలు ఏంటి?
బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి పెరగడం, డాలర్ విలువలో మార్పులు రావడం, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్ అధికంగా ఉండటం ఇవన్నీ ప్రధాన కారణాలు అని చెబుతున్నారు. అంతేకాదు ద్రవ్యోల్బణం పెరిగిన సందర్భాల్లో చాలా మంది పెట్టుబడిదారులు బంగారం వైపు మళ్లడం వల్ల ధరలు ఇంకా ఎగబాకుతున్నాయి. ఇక రానున్న పండుగ సీజన్‌లో భారత్‌లో బంగారం డిమాండ్ మరింత పెరుగుతుందని అంచనా.
ఇది కూడా చదవండి: BSNL: ప్రత్యేక ఆఫర్ పొడిగింపు.. కేవలం 1 రూపాయికే 30 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




