AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IndiGo: ఇండిగో ఎయిర్ లైన్స్‌పై డీజీసీఏ కొరడా.. రూ.30 లక్షల జరిమానా.. కారణం ఏంటంటే!

మరో భారతీయ విమానయాన సంస్థ ఇండిగోకు లక్షల జరిమానా పడింది. కార్యకలాపాలు, శిక్షణ, ఇంజనీరింగ్ విధానాలకు సంబంధించిన పత్రాలలో కొన్ని వ్యవస్థాగత లోపాల కారణంగా ఎయిర్‌లైన్ ఇండిగోపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించింది. ఇండిగో A321 తరగతి విమానం ఈ సంవత్సరం ఆరు నెలల్లో నాలుగు 'టెయిల్ స్ట్రైక్' లు ఉన్నాయి. దీని తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్‌లైన్‌పై ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది..

IndiGo: ఇండిగో ఎయిర్ లైన్స్‌పై డీజీసీఏ కొరడా.. రూ.30 లక్షల జరిమానా.. కారణం ఏంటంటే!
Indigo Airlines
Subhash Goud
|

Updated on: Jul 28, 2023 | 7:21 PM

Share

మరో భారతీయ విమానయాన సంస్థ ఇండిగోకు లక్షల జరిమానా పడింది. కార్యకలాపాలు, శిక్షణ, ఇంజనీరింగ్ విధానాలకు సంబంధించిన పత్రాలలో కొన్ని వ్యవస్థాగత లోపాల కారణంగా ఎయిర్‌లైన్ ఇండిగోపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించింది. ఇండిగో A321 తరగతి విమానం ఈ సంవత్సరం ఆరు నెలల్లో నాలుగు ‘టెయిల్ స్ట్రైక్’ లు ఉన్నాయి. దీని తర్వాత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఎయిర్‌లైన్‌పై ప్రత్యేక ఆడిట్ నిర్వహించింది.

‘టెయిల్ స్ట్రైక్’ అంటే ఏమిటి?

టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో విమానం ‘టెయిల్’ రన్‌వేని తాకడం ప్రారంభించినప్పుడు దానిని ‘టెయిల్ స్ట్రైక్’ అంటారు. ఆడిట్‌లో ఇండిగో కార్యకలాపాలు, శిక్షణ, ఇంజనీరింగ్, ఎఫ్‌డిఎం (ఫ్లైట్ డేటా మానిటరింగ్) ప్రోగ్రామ్‌కు సంబంధించిన పత్రాలు, ప్రక్రియను సమీక్షించామని డిజిసిఎ శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఆ ప్రకటన ప్రకారం.. ప్రత్యేక ఆడిట్ కార్యాచరణ, శిక్షణ విధానాలు, ఇంజనీరింగ్ విధానాలకు సంబంధించిన పత్రాలలో కొన్ని వ్యవస్థాగత లోపాలను గుర్తించింది.

ఈ నేపథ్యంలో విమానయాన సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. డీజీసీఏ నిబంధనలు, ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీదారు (ఓఈఎం) మార్గదర్శకాలకు అనుగుణంగా దాని పత్రాలు, విధానాలను సవరించాలని ఇండిగోకు ఆదేశించింది. ఈ కారణంగా జరిమానా విధించినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి