AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crypto Currency: పరుగులు తీస్తున్న క్రిప్టోకరెన్సీ.. ఆరునెలల్లో రెట్టింపైన బిట్ కాయిన్ ధర!

క్రిప్టోకరెన్సీల ధరలో విపరీతమైన పెరుగుదల ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ ధర ఈరోజు 67,803 డాలర్లకు చేరుకుంది. గత 6 నెలల్లో దీని ధర రెట్టింపు అయింది.

Crypto Currency: పరుగులు తీస్తున్న క్రిప్టోకరెన్సీ.. ఆరునెలల్లో రెట్టింపైన బిట్ కాయిన్ ధర!
Crypto Currency
Follow us
KVD Varma

|

Updated on: Nov 09, 2021 | 11:21 AM

Crypto Currency: క్రిప్టోకరెన్సీల ధరలో విపరీతమైన పెరుగుదల ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ ధర ఈరోజు 67,803 డాలర్లకు చేరుకుంది. గత 6 నెలల్లో దీని ధర రెట్టింపు అయింది. అదేవిధంగా బిట్‌కాయిన్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన కరెన్సీ అయిన ఈథర్ ధర కూడా భారీగా పెరిగింది. ఈథర్ ధర ప్రస్తుతం 4,825 డాలర్లకు చేరుకుంది. రెండు కరెన్సీలు అక్టోబర్ నుండి డాలర్‌తో పోలిస్తే 70% అధిక రాబడిని ఇచ్చాయి. బిట్‌కాయిన్, ఇతర కరెన్సీలలో ర్యాలీ అక్టోబర్ నెల నుండి ప్రారంభమైంది. ఎందుకంటే క్రిప్టోకరెన్సీల ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ETF) గత నెలలో యూఎస్ లో ప్రారంభం అయింది. ప్రపంచంలో ఇదే మొదటి బిట్ కాయిన్ ఈటీఎఫ్.

బిట్‌కాయిన్‌లో 95 మిలియన్ డాలర్లు..

గత వారం బిట్‌కాయిన్‌లో మొత్తం95 మిలియన్లు డాలర్లు వచ్చాయి. ఇది అన్ని డిజిటల్ ఆస్తులలో అత్యధిక మొత్తం. కాగా, గత రెండు నెలల్లో ఈ ఆస్తుల్లో 2.8 బిలియన్‌ డాలర్లు వచ్చాయి. ఇటీవలి వారాల్లో ఆస్ట్రేలియా అతిపెద్ద బ్యాంక్ రిటైల్ కస్టమర్‌లకు క్రిప్టో వ్యాపారాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. ఇతర క్రిప్టో కరెన్సీలు బినాన్స్ కాయిన్, సోలానా రెండూ మూడు, నాల్గవ అత్యంత ప్రజాదరణ పొందిన కరెన్సీలు. గత 7 రోజుల్లో వాటి ధరలు 20% పెరిగాయి.

మార్కెట్ క్యాప్ తొలిసారిగా 3 ట్రిలియన్ డాలర్లు దాటింది

క్రిప్టో ధరల వేగవంతమైన పెరుగుదల దాని మార్కెట్ క్యాప్‌ను మొదటిసారిగా 3 ట్రిలియన్ డాలర్లకు తీసుకువెళ్లింది. ప్రస్తుతం క్రిప్టోలో మొత్తం 13,796 కరెన్సీలు ట్రేడింగ్ అవుతున్నాయి. అక్టోబర్ 15న బిట్‌కాయిన్ ధర 60,000 డాలర్లు దాటింది.

ఏప్రిల్‌లో ధర 64 వేలకు మించి ఉంది

బిట్‌కాయిన్ యొక్క అత్యధిక ధర ఏప్రిల్ 2021లో ఉంది. ఆ సమయంలో బిట్‌కాయిన్ 64,889 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆ తర్వాత ఈ కరెన్సీలో భారీ పతనం జరిగింది. దీంతో బిట్ కాయిన్ ధర 30 వేల డాలర్లకు చేరింది. కాగా, అతి త్వరలో బిట్‌కాయిన్ ధర ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని నిపుణులు భావిస్తున్నారు. చాలా మంది విశ్లేషకులు పెట్టుబడిదారులకు వారి పోర్ట్‌ఫోలియోలో క్రిప్టోను చేర్చుకోవాల, దానిని అసెట్ క్లాస్‌గా సూచించాలని సలహా ఇస్తున్నారు. భారతదేశంలో క్రిప్టో మార్కెట్ 2030 నాటికి 241 మిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. 2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా2.3 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉండవచ్చు.

భారతదేశం లో 1.5 మిలియన్ వరకు క్రిప్టో పెట్టుబడిదారులు..

నాస్కామ్ నివేదిక ప్రకారం, భారతదేశంలో క్రిప్టో విభాగంలో పెట్టుబడిదారుల సంఖ్య 15 మిలియన్లు. బిట్‌కాయిన్ విజృంభణకు ప్రధాన కారణం యుఎస్ బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ (ఇటిఎఫ్)ని ప్రారంభించడం. ఇంతకు ముందు ఎల్ సాల్వడార్ అనే దేశం బిట్‌కాయిన్‌కు చట్టపరమైన గుర్తింపు ఇచ్చింది. జూలైలో, బిట్‌కాయిన్ ధర 32 వేల దిగువకు చేరుకుంది. అంటే, ఇది ఏప్రిల్ ధరతో పోలిస్తే 50% పడిపోయింది. అయితే ఇప్పుడు బిట్‌కాయిన్ ధర జూలైతో పోలిస్తే 100% పైగా పెరిగింది.

బిట్‌కాయిన్ అత్యంత ప్రజాదరణ పొందిన కరెన్సీ

అన్ని క్రిప్టో కరెన్సీలలో బిట్‌కాయిన్ అత్యంత ప్రజాదరణ పొందినది. చైనాలో క్రిప్టో పెద్ద వ్యాపారం. అయితే, సెప్టెంబర్‌లో చైనా క్రిప్టోను నిషేధించింది. చైనా సిచువాన్‌లోని క్రిప్టోకరెన్సీ మైనింగ్ ప్రాజెక్ట్‌ను మూసివేసింది. క్రిప్టో నిపుణులు ఈ నెల లేదా వచ్చే నెలలో బిట్‌కాయిన్ ధర 98 వేల డాలర్ల వరకు అదేవిధంగా సంవత్సరం చివరి నాటికి 1.35 మిలియన్ల డాలర్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. బిట్‌కాయిన్ 2008 సంవత్సరంలో ప్రారంభమైంది.

ఇవి కూడా చదవండి: Changing Rules: మారుతున్న రూల్స్..ఇకపై వస్తువుల ప్యాకేజీలపై ఎమార్పీతో పాటు దానిని కూడా చెప్పాల్సిందే!

Low Blood Pressure: మీకు తెలుసా? లోబీపీ కూడా స్ట్రోక్‌కు కారణం అవుతుంది.. జాగ్రత్తలు తప్పనిసరి!

Health: మీకు తెలుసా ఇంట్లో ఉపయోగించే బొమ్మలు-ఫర్నిషింగ్ మెటీరియల్స్ మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి..ఎలాగంటే..