Ayushman Bharat: ఆయుష్మాన్‌ భారత్‌లో మృతులకు చికిత్స జరిగిందన్న నివేదికలు అవాస్తవం: కేంద్రం

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ ఒకటి. అయితే గత రెండు రోజుల కిందట ఈ పథకంలో అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. లబ్ధిదారుల్లో మృతి చెందిన వారి పేర్లు ఇప్పటికీ చికిత్స పొందుతున్నట్లుగా కొనసాగుతున్నాయని వచ్చిన మీడియా కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటనలో ఖండించింది..

Ayushman Bharat: ఆయుష్మాన్‌ భారత్‌లో మృతులకు చికిత్స జరిగిందన్న నివేదికలు అవాస్తవం: కేంద్రం
Ayushman Bharat
Follow us
Subhash Goud

|

Updated on: Aug 18, 2023 | 3:39 PM

ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని పథకాలు దుర్వినియోగం అవుతున్నట్లు అప్పుడప్పుడు కొన్ని కథనాలను చూస్తుంటాము. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కూడా పథకాలు పక్కదారి పడుతుంటాయి. అలాంటి వాటిపై నివేదికలు ఎప్పటికప్పుడు విడుదల అవుతూనే ఉంటాయి. ఇక తాజాగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ పథకంలో అక్రమాలు జరిగినట్లు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (కాగ్‌) ఇచ్చిన నివేదిక సంచలనంగా మారాయి. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో ప్రధాన మంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ ఒకటి. అయితే గత రెండు రోజుల కిందట ఈ పథకంలో అక్రమాలు జరిగినట్లు నివేదికలు రావడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

లబ్ధిదారుల్లో మృతి చెందిన వారి పేర్లు ఇప్పటికీ చికిత్స పొందుతున్నట్లుగా కొనసాగుతున్నాయని వచ్చిన మీడియా కథనాల్లో ఎలాంటి వాస్తవం లేదని, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గురువారం ఓ ప్రకటనలో ఖండించింది. లబ్ధిదారుల అర్హతను నిర్ణయించడంలో మొబైల్‌ నంబర్లకు ఎలాంటి సంబంధం ఉండదని, ఇలాంటివి తప్పుదోవ పట్టించేందుకే వైరల్‌ అవుతున్నాయని తెలిపింది. మీడియాలో వచ్చిన కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. ఈ వార్తలు కూడా కాగ్‌ నివేదిక ఆధారంగా అంటూ ఆయుష్మాన్‌ భారత్‌పై మీడియాలో ఈ కథనాలు వెలువడ్డాయి. అయితే ఒకే లబ్ధిదారు ఒకేసారి రెండు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన సంఘటనలు కూడా ఆ కథనాల్లో పేర్కొన్నారు.

సెప్టెంబర్‌ 2018 నుంచి 2021 నెల వరకు ఆయుష్మాన్‌ భారత్‌ దేశంలో అమలు అవుతున్న తీరుపై గత వర్షాకాల సమావేశాల్లో కాగ్‌ నివేదికను పార్లమెంటులో ప్రకటించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆ ప్రకటనలో ధ్రువీకరించింది. ఈ నివేదికలోని కాగ్‌ సిఫార్సులను సమగ్రంగా పరిశీలించి, పథకాన్ని సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఈ స్కీమ్‌పై వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని తెలిపింది. అయితే కాగ్‌ ఇచ్చిన నివేదికలో 3,446 మంది రోగులకు సంబంధించి 3,903 క్లెయిమ్‌లు ఉన్నాయని, దేశవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులకు రూ.6.97 కోట్లు చెల్లించినట్లు ఆడిట్ పేర్కొంది. మృతి చెందిన రోగులు ఇంకా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు నివేదికింది. ఈ నివేదికలపై ఖండించింది కేంద్రం.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి