SIM Cards: సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్.. 52 లక్షల కనెక్షన్‌లు రద్దు.. కేంద్రం సంచలన నిర్ణయం
బల్క్ సిమ్ కనెక్షన్‌లు ఇకపై అందుబాటులో ఉండవు. ఇలా పొందిన చాలా సిమ్ లు అసలు వాడకుండా దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో బల్క్ సిమ్‌ల జారీని నిలిపివేయాలని నిర్ణయించారు. పెద్దమొత్తంలో కాకుండా వ్యాపార సిమ్ కనెక్షన్‌లు మాత్రమే అందించబడతాయి. కానీ మీరు బిజినెస్ సిమ్‌ని పొందాలనుకుంటే మీరు ఆ వ్యాపారం లేదా కార్పొరేట్ సంస్థ నుంచి కేవైసీ పొందాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ఈ సంస్థలు రిజిస్టర్ అయినందున వారి GST రిజిస్ట్రేషన్..
టెలికాం రంగంలో కేంద్ర ప్రభుత్వం రెండు కొత్త సంస్కరణలు చేపట్టింది. బల్క్ సిమ్‌ల కనెక్షన్‌లను అందించడం నిలిపివేసింది. అలాగే, సిమ్‌కార్డులు విక్రయించే డీలర్లు తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ పొందాలని కేంద్రం సూచించింది. దీంతో ప్రభుత్వం రెండు చర్యలను ప్రకటించింది. డిజిటల్ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో మొబైల్ వినియోగదారులను రక్షించేందుకు ఈ చర్యను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
బల్క్ సిమ్‌లకు బదులుగా బిజినెస్ సిమ్:
బల్క్ సిమ్ కనెక్షన్‌లు ఇకపై అందుబాటులో ఉండవు. ఇలా పొందిన చాలా సిమ్ లు అసలు వాడకుండా దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో బల్క్ సిమ్‌ల జారీని నిలిపివేయాలని నిర్ణయించారు. పెద్దమొత్తంలో కాకుండా వ్యాపార సిమ్ కనెక్షన్‌లు మాత్రమే అందించబడతాయి. కానీ మీరు బిజినెస్ సిమ్‌ని పొందాలనుకుంటే మీరు ఆ వ్యాపారం లేదా కార్పొరేట్ సంస్థ నుంచి కేవైసీ పొందాల్సి ఉంటుందని కేంద్రం సూచించింది. ఈ సంస్థలు రిజిస్టర్ అయినందున వారి GST రిజిస్ట్రేషన్, పాన్, ఐటీ రిజిస్ట్రేషన్ వివరాలు అందుబాటులో ఉన్నాయి.
సిమ్ డీలర్లకు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి:
సిమ్‌లు విక్రయించే డీలర్లు పోలీస్ వెరిఫికేషన్ పొందడం తప్పనిసరి చేసింది కేంద్రం. పోలీస్ వెరిఫికేషన్ మాత్రమే కాకుండా బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా చేయాలని, సిమ్ కార్డుల దుర్వినియోగానికి డీలర్లను బాధ్యులను చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. సిమ్ డీలర్ల ద్వారా సంఘ వ్యతిరేక శక్తులు సిమ్ లు పొందుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
52 లక్షల సిమ్ కనెక్షన్ల రద్దు:
ఈ ఏడాది మేలో ప్రభుత్వం సంచార్ సాథి అనే పోర్టల్‌ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 52 లక్షల సిమ్ కనెక్షన్లు రద్దు అయ్యాయి. నకిలీ పత్రాలను ఉపయోగించి వీటిని తెరిచారని, ఈ నేపథ్యంలో వీటిని రద్దు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అలాగే 67,000 మంది సిమ్ డీలర్లను బ్లాక్ లిస్ట్ చేశారు. 17,000 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు బ్లాక్ చేయబడ్డాయి. 300 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అంతే కాదు స్పామింగ్‌లో నిమగ్నమైన 66,000 వాట్సాప్ ఖాతాలు బ్లాక్ చేసినట్లు తెలుపగా, 8 లక్షల వ్యాలెట్ ఖాతాలను కూడా బ్లాక్ చేశామని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
అయితే భారత దేశంలో సిమ్ కార్డుల వల్ల మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. బల్క్ సిమ్ కార్డులు తీసుకుంటే తర్వాత వాటిని వినియోగించకపోవడం, తర్వాత కొన్ని మోసాలు కూడా జరుగుతుండటం కేంద్రం విచారణలో తేలింది. అలాగే సిమ్ కార్డు డిలర్ల వద్ద కూడా కొన్ని మోసాలు జరుగుతున్నాయని గమనించింది కేంద్రం. ఈ నేపథ్యంలో సిమ్ కార్డులను విక్రయించే డీలర్లకు కూడా పోలీసు వెరిఫికేషన్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సర్కార్. కొన్ని కఠినమైన చర్యల వల్ల మోసాలను అరికట్టే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి