AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వారి అకౌంట్లోకి రూ. 1500 వేస్తున్న ప్రభుత్వం.. మే 31 చివరితేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..

కేంద్ర ప్రభుత్వం రైతులు, విద్యా్ర్థులకు, వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక భరోసా అందించేందుకు కొన్ని రకాల స్కీమ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే.

వారి అకౌంట్లోకి రూ. 1500 వేస్తున్న ప్రభుత్వం.. మే 31 చివరితేదీ.. ఎలా అప్లై చేసుకోవాలంటే..
Money
Rajitha Chanti
|

Updated on: May 26, 2021 | 9:09 AM

Share

కేంద్ర ప్రభుత్వం రైతులు, విద్యా్ర్థులకు, వృద్ధులకు, వికలాంగులకు ఆర్థిక భరోసా అందించేందుకు కొన్ని రకాల స్కీమ్స్ అందిస్తున్న విషయం తెలిసిందే. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న ట్రాన్స్‏జెండర్లకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది. వారి బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేస్తుంది. కరోనా కష్టంలో ఈ వార్త వారికి ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. ట్రాన్‏జెండర్ కమ్యూనిటీ సభ్యులు ప్రభుత్వ సహాయం కోరుతూ.. కాల్స్, ఈ మెయిల్స్ చేసినట్లుగా కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. ట్రాన్స్‏జెండర్ సంక్షేమానికి నోడల్ మంత్రిత్వ శాఖగా ఉన్న సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ప్రతి ట్రాన్స్‏జెండర్‏కు ప్రాథమిక అవసరాల కోసం తక్షణ సహాయంగా రూ.1500 జీవనాధార భత్యాన్ని అందించాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సహాయం ట్రాన్స్‏జెండర్ సమాజానికి రోజువారీ అవసరాలను తీర్చడానికి సహాయపడుతుంది.

ఇక ఇప్పటివరకు వారి ట్రాన్స్‏జెండర్ వ్యక్తుల కోసం పనిచేస్తున్న ఎన్జీఓలు, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు ఆర్థిక సాయం గురించి వారికి ఆవగాహన కల్పించాలని ప్రభుత్వం కోరింది. కేంద్ర ప్రభుత్వం గతేడాది లాక్ డౌన్ సమయంలో కూడా ఇలాగే ఆర్థిక సాయం చేసింది. రేషన్ కిట్లను అందించింది. ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్ వంటి వివరాలు అందించాలి. ట్రాన్‏జెండర్లు ఈ లింక్ పై క్లిక్ చేసి డబ్బుల కోసం అప్లై చేసుకోవచ్చు. వీటి అప్లై చేసుకోవడానికి మే 31 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Also Read: Anandayya Natumandu: ఆనందయ్య నాటు మందుతో దుష్పరిణామాలు.. నెల్లూరు ఆసుపత్రిలో పెరుగుతున్న బాధితుల సంఖ్య..?

లాక్‏డౌన్ టైమ్‏లో పొట్ట తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా ? పొట్ట తగ్గడానికి ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసా.. ట్రై ఇట్..

‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ సన్నివేశాలకు నాకు కన్నీళ్లు వచ్చాయి.. వాటిలో ఒక రకమైన బాధ దాగి ఉంది.. విజయేంద్రప్రసాద్..

పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్‏గా మారనున్న ప్రభాస్.. హాలీవుడ్ సినిమాలో రెబల్ స్టార్.. విడుదల ఎప్పుడంటే..