లాక్‏డౌన్ టైమ్‏లో పొట్ట తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా ? పొట్ట తగ్గడానికి ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసా.. ట్రై ఇట్..

Weight Loss : ఆధునిక కాలంలో ఎక్కువగా కూర్చోని పనిచేయడం వలన చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.

లాక్‏డౌన్ టైమ్‏లో పొట్ట తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా ? పొట్ట తగ్గడానికి ఏం తినాలి.. ఏం తినకూడదో తెలుసా.. ట్రై ఇట్..
Weight Loss
Follow us
Rajitha Chanti

|

Updated on: May 26, 2021 | 7:45 AM

Weight Loss : ఆధునిక కాలంలో ఎక్కువగా కూర్చోని పనిచేయడం వలన చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే కాకుండా.. ప్రస్తుతం చాలా మందిలో పొట్ట పెరిగిపోవడం అనే సమస్య తీవ్రంగా వేదిస్తోంది. తిండితో సంబంధం లేకుండా.. బరువు, పొట్ట పెరగడం వంటి సమస్యలతో చాలా మంది మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు జిమ్ లో నానా కష్టాలు పడుతుంటారు. ఇక ఈ సమస్య ప్రస్తుతం మరింత ఎక్కువగా మారింది. లాక్ డౌన్, వర్క్ ఫ్రమ్ హోం విధానాల వలన చాలా మందిలో ఈ సమస్యలు పెరుగుతున్నాయి. అయితే మరీ అంతగా ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. సరైన వ్యాయమాలు చేస్తూ.. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా సులభంగా పొట్టను తగ్గించుకోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందామా..

వీటికి దూరంగా.. వేపుళ్లు..ఇందులో కెలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ వంటకాల్లోని నూనె పొట్టలోకి వెళ్లి కొవ్వుగా మారుతుంది. ఇది కరిగిపోవడం చాలా కష్టమైన పని. దీంతో ఊబకాయం, మధుమేహం, రకారకాల క్యాన్సర్ లు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండాలి.

షుగర్ ఐటమ్స్.. సోడా, శీతల పానీయాలు, పండ్లరసాలలో ఎక్కువగా షుగర్ ఉంటుంది. అలాగే బిస్కట్లు, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లలో కూడా షుగర్ ఉంటుంది. వీటిలో కెలరీలు తక్కువగానే ఉంటాయి. కానీ షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తం, హర్మోన్లపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది పొట్టకే కాదు. కాలేయంలోనూ కొవ్వులు జమ కావడానికి కారణమవుతుంది. అలాగే అనారోగ్యాన్ని పెంచుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలి.

ఉప్పు.. ఇది కూడా పొట్ట పెరగడానికి కారణం అంటున్నారు నిపుణులు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వలన నీళ్లు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. అలా అని అవసరానికంటే ఎక్కువ నీళ్లు తాగిన సమస్యే. ఇది మీ బరువులో మార్పు తెస్తుంది.

ఏం తినాలంటే.. పొట్ట తగ్గించుకోవడం కోసం కూరగాయలను ఉడికించి తీసుకోవాలి. లేదా అవెన్ లో ఉడికించుకోవాలి. స్వీట్ తినాలపించినప్పుడు బెర్రీ, మామిడి పండ్లను తినాలి. టీ, కాఫీలకు బదులుగా కూరగాయలు, పండ్ల రసాలను తాగాలి. చిప్స్, వడియాలు, అప్పడాలు కాకుండా.. ఎండుఫలాలు, గింజలు, ఫ్రూట్ క్యాండీలను తినాలి.

యాపిల్.. రోజూ ఓ యాపిల్ తింటే పొట్ట తగ్గుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని కొవ్వులను కరిగిస్తుంది.

పెరుగు.. ఇందులో ఉండే ప్రోటిన్ కొవ్వును తగ్గిస్తుంది. అలాగే ఇందులోని ప్రోటిన్ జీవక్రియను మెరుగు పరుస్తుంది. ఇవి అధిక కెలోరీలను కరిగించడంతోపాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.

చిరుధాన్యాలు.. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించడంలో చిరుధాన్యాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అలాగే ముతక బియ్యం, గోధుమలు, ఓట్స్, క్వినోవా, రాగులు, సామలు, జొన్నలు వీటన్నింటినీ ఆహారంలో తీసుకుంటే.. క్రమంగా పొట్ట తగ్గుతుంది.

Also Read: LIC పాలసీదారులకు హెచ్చరిక.. వారితో జాగ్రత్తగా ఉండండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు.. ఎల్ఐసీ ట్వీట్..

‘ఆర్ఆర్ఆర్’ యాక్షన్ సన్నివేశాలకు నాకు కన్నీళ్లు వచ్చాయి.. వాటిలో ఒక రకమైన బాధ దాగి ఉంది.. విజయేంద్రప్రసాద్..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!