Bank Holidays in June 2021: బ్యాంక్ కస్టమర్స్ బీ ఎలర్ట్.. జూన్ నెలలో ఎన్ని సెలవులు ఉన్నాయంటే..
Bank Holidays in June 2021: జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు తెరిచి ఉంటాయో.. ఎన్ని రోజులు బ్యాంకులు మూసివుంటాయో తెలుసుకోవడం ముఖ్యం.
కరోనా వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో ఆన్‌లైన్‌లోనే చేయడం మంచిదని అంటున్నారు నిపుణులు. అయితే ఇలాంటి సమయంలో కూడా బ్యాంక్ ఉద్యోగుల తమ వినియోగదారులకు సేవలను అందిస్తున్నారు. అంతే కాదు చాలా బ్యాంకులు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తాయి. సామాజిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు తమ వినియోగదారులకు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సదుపాయాన్ని ఉపయోగించమని సలహా ఇస్తున్నాయి. కరోనా కొత్త కేసులు తగ్గున్నాయి కానీ పరిస్థితి ఇంకా కష్టంగా ఉంది. అటువంటి పరిస్థితిలో జూన్‌లో ఎన్ని రోజులు బ్యాంకులు తెరుచుకుంటాయి.. బ్యాంకులు ఎప్పుడు మూసివేయబడతాయి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం.
జూన్ 1 మంగళవారం కావడంతో బ్యాంకులు తెరిచి ఉంటాయి. జూన్ 6 ఆదివారం బ్యాంకులు మూసివేయబడతాయి. ఆ తరువాత జూన్ 12,13 తేదీలలో రెండవ శనివారం, ఆదివారం కారణంగా బ్యాంకులు మూసివేయబడతాయి. ఆ తరువాత జూన్ 20 ఆదివారం బ్యాంకులు మూసివుంటాయి. ఆ తరువాత నెల నాలుగవ వారంలో 26,27 (నాల్గవ శనివారం, ఆదివారం) బ్యాంకులు మూసివేయబడతాయి.
ఇదిలా ఉంటే.. బ్యాంకు హాలిడేస్.. రాష్ట్రం ప్రాతిపదికన మారుతూంటాయి. ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే మరో రాష్ట్రంలో హాలిడే ఉండకపోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ క్లోజ్ ఉన్నా కూడా ఆన్ లైన్ బ్యాంకింగ్ సర్వీసులు పొందవచ్చు. ఏటీఏం, మొబైల్ బ్యాంకింగ్, ఆన్ లైన్ బ్యాంకింగ్ వంటి సేవలు లభిస్తాయి.