AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహిళల కోసం కేంద్రం మరో స్కీమ్.. తక్షణమే రూ.10 లక్షల రుణం..

కేంద్రం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. అందులోనూ మహిళలు సొంతంగా వ్యాపారం చేస్తూ.. సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. ఇప్పటికే మహిళల కోసం ఎన్నో రకాల పథకాలను ప్రకటించిన కేంద్రం....

మహిళల కోసం కేంద్రం మరో స్కీమ్.. తక్షణమే రూ.10 లక్షల రుణం..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 07, 2020 | 3:43 PM

Share

కేంద్రం ఎన్నో రకాల పథకాలను అందిస్తోంది. అందులోనూ మహిళలు సొంతంగా వ్యాపారం చేస్తూ.. సాధికారత సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. ఇప్పటికే మహిళల కోసం ఎన్నో రకాల పథకాలను ప్రకటించిన కేంద్రం.. వారి కోసం మరో స్కీమ్‌ని ప్రేవేశ పెట్టింది. ఈ డబ్బుతో మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకోవచ్చు. ‘మహిళా ఉద్యమ్ నిధి’ పేరుతో చిన్న తరహా పరిశ్రమలను నిర్వహించే మహిళలకు రూ.10 లక్షల వరకూ ఆర్థిక సహకారం అందించనుంది కేంద్రం. ఉమెన్ ఎంట్రప్రెన్యూర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది.

ఈ డబ్బుతో మహిళలు పలు రకాల వ్యాపారాలు చేసుకోవచ్చు. అలాగే తీసుకున్న రుణాన్ని 10 ఏళ్ల లోపు చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా మహిళలకు ప్రత్యేకంగా ఫిక్స్‌డ్ వడ్డీ రేట్ ఉంటుంది. అయితే ఈ వ్యాపారంలో మహిళల భాగస్వామ్యం 51 శాతం కన్నా ఎక్కువగా ఉండాలి. వ్యాపారాన్ని విస్తరించేందుకు, ఉత్పత్తి పెంచేందుకు, సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు ఈ లోన్ తీసుకోవచ్చు.

దీంతో మహిళలు బ్యూటీ పార్లల్, పలు రకాల సర్వీస్ సెంటర్స్, క్యాంటీన్, రెస్టారెంట్స్, సైబర్ కేఫ్, టెలీఫోన్ బూత్, జిరాక్స్ సెంటర్స్, టీవీ రిపేరింగ్, సెలూన్స్, టైలరింగ్, కంప్యూటరైజ్డ్ డెస్క్ టాప్, బట్టల షాపులు లాంటి వ్యాపారాలకు ఈ లోన్ తీసుకోవచ్చు. ఈ రుణాలకు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మొదట పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ స్కీమ్‌ని ప్రారంభించింది. కానీ ఇప్పుడు దాదాపు అన్ని బ్యాంకుల్లో ఈ లోన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే సంబంధిత బ్యాంకుల వద్దకు వెళ్లి మీ వ్యాపారానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకోవచ్చు.

Read More:

విషాదం.. కరోనా వైరస్‌తో జర్నలిస్ట్ మృతి

సీరియల్స్‌లో నటించే.. అన్నాచెల్లెలు ఆత్మహత్య

ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Follow Us
బిగ్ బాస్‏లోకి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఆ సీరియల్ బ్యూటీ ఎంట్రీ..
బిగ్ బాస్‏లోకి కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఆ సీరియల్ బ్యూటీ ఎంట్రీ..
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు.. 8 మంది మృతి!
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుళ్లు.. 8 మంది మృతి!
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ఒక్కటి తిన్నా కొండంత బలం
పిల్లల లంచ్ బాక్స్‌లోకి బెస్ట్.. ఒక్కటి తిన్నా కొండంత బలం
భార్యాభర్తలకు సూపర్ స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ..
భార్యాభర్తలకు సూపర్ స్కీమ్.. ఒక్కసారి పెట్టుబడి పెడితే ..
బోనాల స్పెషల్.. పొట్టేల్ కర్రీ త్వరగా ఉడికి, రుచిగా ఉండాలా?
బోనాల స్పెషల్.. పొట్టేల్ కర్రీ త్వరగా ఉడికి, రుచిగా ఉండాలా?
బంగాళాదుంపలు ఆకుపచ్చగా మారితే ఏం చేయాలి? తినడానికి సురక్షితమా ?
బంగాళాదుంపలు ఆకుపచ్చగా మారితే ఏం చేయాలి? తినడానికి సురక్షితమా ?
భూమిపై తీరం లేని ఏకైక సముద్రం.. అయోమయంలో శాస్త్రవేత్తలు..ఆ రహస్యం
భూమిపై తీరం లేని ఏకైక సముద్రం.. అయోమయంలో శాస్త్రవేత్తలు..ఆ రహస్యం
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
భర్తను చంపేందుకు భార్య భయానక కుట్ర..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!
వారికి అదృష్ట కాలం.. ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ పక్కా..!
చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..
చిటికెలో శరీరం మొత్తం యాక్టీవ్ అవ్వాలంటే ఒంట్లో ఇవి పడాల్సిందే..