చెన్నైలో జరిగిన ఓ వివాహ వేడుక రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖుల కలయికకు వేదికగా మారింది. తమిళనాడు సీఎం విజయ్, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, కేటీఆర్, నటి త్రిష, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఒకే వేదికపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.