AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Congress: ఏపీ పురపాలికల్లో ఒక వార్డ్ గెలుచుకున్న కాంగ్రెస్… ఆమంచి కృష్ణ మోహన్ ఎఫెక్ట్..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. చీరాల మున్సిపాలిటీలోని 25వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. చీరాల మున్సిపాలిటీకి ఈ నెల 1వ తేదీన ఎన్నికలు జరగ్గా, 3వ తేదీన వర్షం కారణంగా ఇక్కడ కౌంటింగ్ నిలిచిపోయింది. తాజాగా ఈ రోజు నిర్వహించిన కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఈ విజయాన్ని నమోదు చేసుకుంది.

Congress: ఏపీ పురపాలికల్లో ఒక వార్డ్ గెలుచుకున్న కాంగ్రెస్... ఆమంచి కృష్ణ మోహన్ ఎఫెక్ట్..
Congress Wins Chirala Ward 25
Anand T
|

Updated on: Nov 06, 2026 | 1:55 PM

Share

ఏపీలో స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీల్లో 1వ తేదీన పోలింగ్ ముగియగా, నవంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఆ రోజు తుపాను ప్రభావంతో చీరాలలో భారీ వర్షం కురవడంతో కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. దాంతో తాజాగా నేడు అక్కడ ఓట్ల లెక్కింపు చేపట్టారు.

ఈ కౌంటింగ్‌లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ తొలి విజయాన్ని అందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా కూటమి పార్టీలు, వైసీపీల మధ్య హోరాహోరీ పోరు సాగుతుండగా.. కాంగ్రెస్ పార్టీ చీరాల మున్సిపాలిటీలో ఖాతా తెరిచింది. చీరాల 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు ఘన విజయం సాధించారు.

ఈ 25వ వార్డులో బీజేపీ అభ్యర్థి రెండో స్థానంలో, వైసీపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. ఇక 22వ వార్డును టీడీపీ అభ్యర్థి కైవసం చేసుకోగా, అక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో, వైసీపీ మూడో స్థానంలో నిలిచాయి.ఇక చీరాలలో కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడ కౌటింగ్ జరగనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us