రాజస్థాన్లోని సికార్ జిల్లాలో జరిగిన భయంకర రోడ్డు ప్రమాదం సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న బోర్డు, కాంక్రీట్ నిర్మాణాన్ని ఢీకొట్టడంతో రైడర్ గాల్లోకి ఎగిరి కిందపడ్డాడు. అయితే ఊహించని విధంగా కొద్దిసేపటికే తనంతట తానుగా లేచి నిలబడటంతో ఈ వీడియో వైరల్గా మారింది.