AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విజయవాడలో కృష్ణా నదిపై మరో భారీ రైల్వే బ్రిడ్జి.. ఈ రూట్లో రాకపోకలు మరింత సులువు..

విజయవాడ నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కృష్ణానదిపై మరో రైల్వే బ్రిడ్జి నిర్మాణం కానుంది. ఇప్పటికే రెండు రైల్వే వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు మూడో వంతెన కూడా నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. ఇప్పటికే డీపీఆర్ కూడా రెడీ అయింది.

విజయవాడలో కృష్ణా నదిపై మరో భారీ రైల్వే బ్రిడ్జి.. ఈ రూట్లో రాకపోకలు మరింత సులువు..
Railway
Venkatrao Lella
|

Updated on: Nov 06, 2026 | 1:15 PM

Share

విజయవాడలో కృష్ణానదిపై ఇప్పటికే రెండు రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయి. విజయవాడ నుంచి రైళ్లు రాకపోకలు సాగించడంలో ఈ రెండు రైల్వే వంతెనలు అత్యంత కీలకంగా కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు మరో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. విజయవాడ నుంచి సీతానగరం మధ్య ఈ మూడో వెంతన ఉండనుంది. ఈ కొత్త వంతెన కూడా పూర్తయితే రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం ఉండదు. రైళ్ల రాకపోకల్లో జాప్యం భారీగా తగ్గనుంది. బల్లార్ష-విజయవాడ-గూడూరు నాలుగో లైన్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా కృష్ణా నదిపై ఈ కొత్త రైల్వే బ్రిడ్జి నిర్మిస్తున్నారు. బల్లార్ష నుంచి ఖాజీపేట వరకు, ఖాజీపేట నుంచి విజయవాడ వరకు, విజయవాడ నుంచి గూడూరు వరకు నాలుగో రైల్వే లైన్‌ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే బ్రిడ్డి రానుంది.

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే బ్రిడ్జి

కృష్ణా నదిపై ఈ మూడో రైల్వే వంతెన 1.30 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. విజయవాడ-కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య ఇది ఉంటుంది. విజయవాడ-గూడురు మధ్య నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్ట్ కోసం రూ.5,858 కోట్లు ఖర్చు చేయనున్నారు. దాదాపు 293 కోలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ విస్తరించి ఉండనుండగా.. ఇప్పటికే డీపీఆర్ రైల్వే బోర్డుకు పంపించారు. ఈ డీపీఆర్‌లో కృష్ణానదిపై నుంచి వంతెన నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం విజయవాడలో కృష్ణానదిపై రెండు రైల్వే బ్రిడ్జిలు ఉండగా.. ఒకటి డబుల్ ట్రాక్, మరొకటి సింగిల్ ట్రాక్‌గా ఉంది. ఈ రెండు బ్రిడ్జిల పక్కన ఈ మూడో వంతెన ఉంటుంది. ఈ కొత్త బ్రిడ్జి అందుబాటులోకి వస్తే.. గుంటూరు, తెనాలి వైపు నుంచే వచ్చే రైళ్లు కృష్ణ కెనాల్ రైల్వే స్టేషన్‌లో ఆగాల్సిన పని ఉండదు. నేరుగా విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అలాగే విజయవాడ నుంచి రాకపోకలు సాగించే గూడ్స్ రైళ్లకు కూడా ఇబ్బంది ఉండదు.

టెండర్ల దశలో రెండు వంతెనలు

ఇక ఏపీలో ఇప్పటికే కృష్ణా నదిపై రెండు వంతెన నిర్మాణానికి సంబంధించి లైన్ క్లియర్ అయింది. అమరావతి- నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్‌ ప్రాజెక్ట్ కోసం అమరావతికి సమీపంలో కృష్ణా నదిపై రైల్వే బ్రిడ్జిని నిర్మించేందుకు టెండర్లు కూడా ఆహ్వానించారు. అలాగే కొత్తగా నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌ లైన్‌లో భాగంగా.. చోడవరం వద్ద కృష్ణానదిపై రైల్వే బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.3,197 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు టెండర్ల దశలో ఉన్నాయి.టెండర్లు ఖరారు అయిన తర్వాత పనులు మొదలయ్యే అవకాశముంది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే అమరావతికి రైళ్ల రాకపోకల్లో ఎలాంటి అంతరాయం ఉండదని చెబుతున్నారు.

Follow Us