విషాదం.. కరోనా వైరస్‌తో జర్నలిస్ట్ మృతి

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఓ జర్నలిస్టుని బలి తీసుకుంది. కరోనా వ్యాప్తి సమయాల్లోనూ డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా సిబ్బంది విధులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది డాక్టర్లు, పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది కరోనా బారిన పడి మృతి...

విషాదం.. కరోనా వైరస్‌తో జర్నలిస్ట్ మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 07, 2020 | 1:14 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి.. ఓ జర్నలిస్టుని బలి తీసుకుంది. కరోనా వ్యాప్తి సమయాల్లోనూ డాక్టర్లు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, మీడియా సిబ్బంది విధులు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొంతమంది డాక్టర్లు, పోలీసులు, ప్రభుత్వ సిబ్బంది కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు. తాజాగా హైదాబాద్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్న మనోజ్ అనే వ్యక్తి కరోనాతో మృతి చెందారు. ఓ న్యూస్ ఛానెల్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈ విషయాన్ని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. కాగా ఇతనికి గతేడాదే వివాహం జరిగింది. తన భార్య ప్రస్తుతం గర్భిణి అని తెలుస్తోంది. మనోజ్ అన్నకు కూడా కరోనా ఉన్నట్లు నిర్థారణ కావడంతో ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. మనోజ్ మృతిపట్ల జర్నలిస్ట్ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి.

కాగా ప్రస్తుతం తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా రోజు వందకు పైగా నమోదవుతుండగా.. శనివారం నాడు ఏకంగా 206 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3496కి చేరింది. శనివారం నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలోనే నమోదయ్యాయి.

ఏకంగా 152 కేసులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వచ్చాయి. ఇక ఆ తర్వాత రంగారెడ్డిలో 10, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో 5, మహబూబ్‌నగర్‌లో4 కేసులు నమోదయ్యాయి. జగిత్యాల, నాగర్ కర్నూల్‌లో రెండేసి చోప్పున కేసులు నమోదవ్వగా.. మహబూబాబాద్, వికారాబాద్‌, గద్వాల్, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 123 మంది మరణించారు.

Read More:

సీరియల్స్‌లో నటించే.. అన్నాచెల్లెలు ఆత్మహత్య

ఈ నెల 16 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..