AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ujjwala Yojana: మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ గ్యాస్ కనెక్షన్లపై సబ్సిడీ కొనసాగింపు..!

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద వంట గ్యాస్‌పై సబ్సిడీని మరో సంవత్సరం మార్చి 31, 2025 వరకు పొడిగించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కొత్త కనెక్షన్‌ల చెల్లింపు కాకుండా భారత ప్రభుత్వం ప్రతి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్‌కు రూ. 300ను ఒక సంవత్సరంలో 12 రీఫిల్‌ల వరకు అర్హులైన కొనుగోలుదారులకు చెల్లిస్తుంది. 2023 అక్టోబర్‌లో సిలిండర్‌పై రూ.100 ఉన్న చెల్లింపును రూ.300కి పెంచారు.

Ujjwala Yojana: మహిళలకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఆ గ్యాస్ కనెక్షన్లపై సబ్సిడీ కొనసాగింపు..!
Gas Subsidy
Nikhil
|

Updated on: Mar 08, 2024 | 9:00 AM

Share

మహిళా దినోత్సవం రోజున మహిళలకు కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పనుందా? అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద వంట గ్యాస్‌పై సబ్సిడీని మరో సంవత్సరం మార్చి 31, 2025 వరకు పొడిగించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కొత్త కనెక్షన్‌ల చెల్లింపు కాకుండా భారత ప్రభుత్వం ప్రతి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్‌కు రూ. 300ను ఒక సంవత్సరంలో 12 రీఫిల్‌ల వరకు అర్హులైన కొనుగోలుదారులకు చెల్లిస్తుంది. 2023 అక్టోబర్‌లో సిలిండర్‌పై రూ.100 ఉన్న చెల్లింపును రూ.300కి పెంచారు. అయితే ప్రస్తుం న్యూఢిల్లీలో  14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 903. ముంబైలో ఎల్‌పిజి సిలిండర్ ధర రూ. 902.5గా ఉంది. సబ్సిడీని ఏడాది పాటు పొడిగించడం వల్ల ప్రభుత్వానికి అదనంగా రూ.12,000 కోట్ల భారం పడవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఉజ్వల పథకం కొనసాగింపునకు సంబంధించిన మరిన్ని వివరాలు ఓ సారి తెలుసుకుందాం. 

ప్రభుత్వం అర్హులైన అభ్యర్థులకు 14.2 కిలోల సిలిండర్‌తో ప్రతి కొత్త గ్యాస్ కనెక్షన్‌కు రూ.1600 నగదు బదిలీ చేస్తుంది. 5 కిలోల సిలిండర్‌కు రూ.1150 చెల్లించాలి. ఈ సబ్సిడీ కింది వాటిని కవర్ చేస్తుంది. సిలిండర్‌కు సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్  14.2 కిలోల సిలిండర్‌కు రూ. 1250 లేదా 5 కిలోల సిలిండర్‌కు రూ. 800గా ఉంది. రెగ్యులేటర్‌కు రూ. 150, ఎల్‌పీజీ పైప్ కోసం రూ. 100, రూ. 25 డొమెస్టిక్ గ్యాస్ కన్స్యూమర్ కార్డ్, రూ. 75 తనిఖీ/ఇన్‌స్టాలేషన్ ఛార్జీలుగా ఉన్నాయి. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (పీఎంయూవై) 2016లో ప్రారంభించారు. మొదటి దశలో దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) కుటుంబాలకు చెందిన ఐదు కోట్ల మంది మహిళా సభ్యులకు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) కనెక్షన్‌లను అందించే లక్ష్యంతో ప్రారంభించారు. మహిళా లబ్ధిదారులను చేర్చడానికి ఏప్రిల్ 2018లో పథకం విస్తరించార. రెండో దశలో ఎనిమిది కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లకు లక్ష్యాన్ని విస్తరించారు.

దరఖాస్తు ఇలా

పీఎంయూవై ఉజ్వల 2.0 కోసం నమోదు ప్రక్రియకు కనీస పత్రాలు అవసరం. అంతేకాకుండా ప్రయోజనం పొందడానికి రేషన్ కార్డులు లేదా చిరునామా రుజువును సమర్పించాల్సిన అవసరం లేదు. దరఖాస్తుదారలు’కుటుంబ ప్రకటన’, ‘చిరునామా రుజువు’ రెండింటినీ సమర్పిస్తే సరిపోతుంది. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన దరఖాస్తును ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా సమీప గ్యాస్ ఏజెన్సీలో దరఖాస్తు ఫారమ్‌ను పూరించి సమర్పించవచ్చు. అలాగే దరఖాస్తుదారు అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఫారమ్‌ను పూరించి ఆ ప్రింట్‌ను సమీపంలోని ఎల్‌పీజీ సెంటర్‌లో సమర్పించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి