Atal Pension: రోజుకు రూ. 7 పెట్టుబడితే నెలకు రూ. 5 వేలు పెన్షన్ పొందొచ్చు.. బెస్ట్ స్కీమ్..
ఉద్యోగ విరమణ తర్వాత నిరంతరం పెన్షన్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారానే మంచి పెన్షన్ పొందొచ్చు. కేవలం రోజుకు ఒక టీ కంటే తక్కువ ఖర్చును సేవింగ్ చేయడం ద్వారా నెలకు రూ. 5వేలు పొందొచ్చు. 18 ఏళ్ల వయసు నుంచి రోజుకు రూ. 7 ఆదా చేసుకుంటూ వేళ్తే చాలు, పదవి విరమణ సమయానికి నెలకు రూ. 5000 పెన్షన్ పొందొచ్చు...
ప్రస్తుతం ప్రతీ ఒక్కరిలో ఆర్థిక క్రమశిక్షణ పెరుగుతోంది. పెరుగుతోన్న అవసరాలు, మారుతోన్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ముందునుంచే ఆర్థికంగా ఎలా ఎదగాలన్నదానిపై ఓ క్లారిటీతో ఉంటున్నారు. ఉద్యోగం చేయడం మొదలు పెట్టిన రోజే పెట్టుబడుల గురించి ఆలోచించే రోజులు వచ్చేశాయ్. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం సైతం పలు ఆకర్షణీయమైన పెట్టుబడి పథకాలతో ఆకట్టుకుంటోంది. ఇలాంటి వాటిలో ఒకటి అటల్ పెన్షన్ స్కీమ్ యోజన.
ఉద్యోగ విరమణ తర్వాత నిరంతరం పెన్షన్ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పెన్షన్ స్కీమ్ ద్వారా తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారానే మంచి పెన్షన్ పొందొచ్చు. కేవలం రోజుకు ఒక టీ కంటే తక్కువ ఖర్చును సేవింగ్ చేయడం ద్వారా నెలకు రూ. 5వేలు పొందొచ్చు. 18 ఏళ్ల వయసు నుంచి రోజుకు రూ. 7 ఆదా చేసుకుంటూ వేళ్తే చాలు, పదవి విరమణ సమయానికి నెలకు రూ. 5000 పెన్షన్ పొందొచ్చు. ఈ పథకం విషయానికొస్తే ఒకవేళ మీరు 18 ఏళ్ల వయసులో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. నెలకు రూ. 210 చెల్లించాల్సి ఉంటుంది.
ఈ లెక్కన రోజుకు కేవలం రూ. 7 చెల్లిస్తే సరిపోతుంది. 60 ఏళ్ల తర్వాత మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత అంటే మీ పదవి విరమణ సమయానికి నెలకు రూ. 500 పెన్షన్ పొందొచ్చు. ఒకవేళ మీరు 25 ఏళ్ల వయసులో అటల్ పెన్షన్ యోజనలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించే నెలకు రూ. 376 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదే 30 ఏళ్ల వయసులో అయితే నెలకు రూ. 577, 35 ఏళ్ల వయసులో అయితే నెలకు రూ. 902 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో మీరు నెలకు రూ. 5వేల పెన్షన్ పొందొచ్చు.
ఇక ఈ పథకం వివరాల విషయానికొస్తే.. ఈ పథకాన్ని 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించారు. అసంఘటిత రంగంలో పనిచేసే వారికి పదవి విరమణ తర్వాత నిరంతంతర ఆదాయం అందించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఇదిలా ఉంటే అక్టోబర్ 1, 2022 నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారు (ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం) పరిధిలోకి వచ్చే వ్యక్తి ఈ పథకాఇనకి అర్హులు కాదు. ఇక కేవలం రూ. 5 వేల పెన్షన్ మాత్రమే కాకుండా.. నెలకు రూ. 1000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, రూ. 5000 కనీస పెన్షన్ హామీని సెలక్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..