AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: మీ ఇంటి నుంచే వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? రూ.20 వేలతో లక్షల్లో ఆదాయం.. ఈ 3 ఐడియాలు..

ఉద్యోగం మానేసి వ్యాపారం మొదలుపెట్టాలని చాలామంది భావిస్తుంటారు. కానీ ఎలాంటి బిజినెస్ మొదలుపెట్టాలనేది చాలామందికి అవగాహన ఉండదు. తక్కువ ఖర్చుతో స్టార్ట్ చేయగలిగే వ్యాపారుల కోసం సెర్చ్ చేస్తుంటారు. రూ.20 వేలలోపు బడ్జెట్‌తో మొదలుపెట్టగలిగే వ్యాపారాలు చాలా ఉన్నాయి. అవేంటి అనేది చూద్దాం.

Business Idea: మీ ఇంటి నుంచే వ్యాపారం చేయాలనుకుంటున్నారా..? రూ.20 వేలతో లక్షల్లో ఆదాయం.. ఈ 3 ఐడియాలు..
Business
Venkatrao Lella
|

Updated on: Sep 19, 2026 | 12:32 PM

Share

వ్యాపారం మొదలుపెట్టాలని చాలామందికి ఉంటుంది. కానీ ఖర్చు గురించి ఆలోచిస్తుంటారు. వ్యాపారం కోసం లక్షలకు లక్షలు డబ్బులు పెట్టుబడి పెట్టా్ల్సి ఉంటుందేమోనని ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ వ్యాపారం స్టార్ట్ చేయాలంటే లక్షలు ఖర్చు చేయనక్కర్లేదు. మీరు తక్కువ ఖర్చుతోనే బిజినెస్ మొదలుపెట్టవచ్చు. మీ గ్రామంలోనే రూ.20 వేలతోనే వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు. రూ.20వేలలోపు ఖర్చుతో చేయగలిగే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. మీ ఇంటి వద్దనే ఉండి మీ గ్రామంలోనే బిజినెస్ పెట్టవచ్చు. ఇటీవల ఉద్యోగాలు చేసేవారు తమ సొంతూళ్లకు వెళ్లి వ్యాపారులు మొదలుపెడుతున్నారు. దీంతో చిన్న వ్యాపారాలకు డిమాండ్ మరింత పెరిగింది. రూ.20వేలలోపు బడ్జెట్‌లో స్థిరమైన ఆదాయాన్ని తెచ్చిపెట్టే వ్యాపారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డెయిరీ బిజినెస్

గ్రామాల్లో పశు పోషణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. దాణా కూడా అందుబాటులో ఉంటుంది. దీంతో గ్రామాల్లో ఉండి చేయగలిగే ఉత్తమమైన వ్యాపారాల్లో డెయిరీ బిజినెస్ ఒకటి. ఇటీవల గ్రామాల్లో పాల ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. చిన్న పెట్టుబడితో దీనిని స్టార్ట్ చేయవచ్చు. అంతేకాకుండా ఎప్పుడూ గిరాకీ ఉండే బిజినెస్ ఇది. పశువుల ద్వారా వచ్చే పాలును ఉదయం, సాయంత్రం వేళల్లో ఇంటింటికి వెళ్లి అందించడం ద్వారా ఆదాయం పొందవచ్చు. పాలతో పాటు పెరుగు, పన్నీర్, నెయ్యి వంటి విక్రయించడం ద్వారా కూడా ఆదాయం సమకూరుతుంది. ఇటీవల డెయిరీ బిజినెస్ ద్వారా రూ.లక్షల్లో సంపాదించేవారు కూడా ఉన్నారు. అధిక సంపాదన ఈ బిజినెస్‌లో ఉంటుంది.

పిండి, మసాలాలు

ఇక పిండి మిల్లు మీ ఇంట్లోనే ప్రారంభించడం ద్వారా ఆదాయం పొందవచ్చు. మీ దగ్గర నిధులు లేకపోతే పాత మెషిన్ తక్కువ ఖర్చుతో కొనుగోలు చేసి ఈ వ్యాపారం స్టార్ట్ చేయవచ్చు. పసుపు, మిరపకాయలు, కొత్తిమీర మొదలైనవాటిని రుబ్బడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు.

మొబైల్ రిపేర్

ఇటీవల ఎవరి చేతుల్లో చూసినా మొబైల్స్ ఉంటున్నాయి. దీంతో మొబైల్ రీపేరింగ్ ద్వారా ఆదాయం పొందవచ్చు. ఖర్చు కూడా ఎక్కువగా ఉండదు. రీఛార్జ్, సిమ్ కార్డ్ సేవలతో పాటు మొబైల్ కవరక్రలు, ఛార్జర్లు, ఇయర్ ఫోన్లు వంటి వస్తువులను విక్రయించడం ద్వారా ఎక్కువ ఆదాయం పొందవచ్చు. ఇక స్క్రీన్లు, బ్యాటరీలు మార్చడం వంటి వారి ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుంది.

వ్యాపారం మొదలుపెట్టేముందు స్థలం, ముడి సరుకు ఖర్చు, విద్యుత్, అద్దె ఖర్చులు వంటి వాటిని అంచనా వేసుకోండి. మీ ప్రాంతంలో ఎక్కువ డిమాండ్ ఉన్న సేవలను ఎంచుకోండి. డిమాండ్‌కు అనుగుణంగా వ్యాపారాన్ని విస్తరించుకోండి.

Follow Us