SBI Customers : ఎస్బీఐ ఖాతాదారులకు బంపర్ ఆఫర్..! కొత్తరకం ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్
SBI Customers : సామాన్య ప్రజలు పిక్స్‌డ్ డిపాజిట్లను మంచి పెట్టుబడి ఎంపికగా భావిస్తారు. ఇందులో పెట్టుబడులు పెట్టడం వల్ల వినియోగదారులకు
SBI Customers : సామాన్య ప్రజలు పిక్స్‌డ్ డిపాజిట్లను మంచి పెట్టుబడి ఎంపికగా భావిస్తారు. ఇందులో పెట్టుబడులు పెట్టడం వల్ల వినియోగదారులకు మంచి రాబడి లభించడమే కాకుండా వారి డబ్బుకు భద్రత కూడా ఉంటుంది. కానీ అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు మీరు మధ్యలో FD ని విచ్ఛిన్నం చేయాలి. దీనివల్ల మీరు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మల్టీ ఆప్షన్ డిపాజిట్ స్కీమ్ సదుపాయాన్ని ప్రేవేశపెడుతోంది. ఈ స్కీంలో మీరు పిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బు నుంచి అవసరమైతే ATM ద్వారా డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మీ FD కి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. అంతేకాకుండా మీ అవసరాలు కూడా నెరవేరుతాయి.
మనీ 9 నివేదిక ప్రకారం.. MODS అనేది ఒక రకమైన టర్మ్ డిపాజిట్. ఇది పొదుపు లేదా కరెంట్ ఖాతాతో లింక్ అయి ఉంటుంది. కస్టమర్‌కు డబ్బు అవసరమైతే ఆ లింక్డ్ ఖాతా నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ ఆ ఖాతాలో డబ్బు లేకపోతే అప్పుడు మోడ్స్ నుంచి డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఉదాహరణకు మీరు మధ్యలో డబ్బును ఉపసంహరించుకుంటే మిగిలిన మొత్తానికి బ్యాంకు వడ్డీ కూడా చెల్లిస్తుంది. ఈ ప్రత్యేక పథకంలో మీరు గరిష్టంగా రూ.10,000 తో పెట్టుబడి పెట్టవచ్చు గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాల వరకు SBI MODS తెరుస్తారు.
ఈ స్కీమ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే,ఇది ప్రీమెచ్యూర్ విత్‌డ్రా సౌకర్యాన్ని కూడా కలిగి ఉంటుంది. తద్వారా మీకు అవసరమైనప్పుడు డబ్బును తీసుకోవచ్చు. రుణాలు, నామినేషన్ సౌకర్యం కూడా MODS లో లభిస్తుంది. అయితే దీనికి కనీస బ్యాలెన్స్ అవసరం. ఇది మీ పెట్టుబడి ఆధారంగా నిర్ణయిస్తారు. SBI కస్టమర్లకు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టడానికి అవకాశాన్ని ఇస్తుంది. ప్రతి సంవత్సరం వివిధ వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు. 7 రోజుల నుంచి 45 రోజుల వరకు, 2.90 శాతం వడ్డీ లభిస్తుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు 5.40 శాతం వడ్డీ లభిస్తుంది.