AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆ రీఛార్జ్ ప్లాన్‌లో కీలక మార్పులు..

బీఎస్ఎన్ఎల్ మరోసారి కస్టమర్లకు షాక్ ఇచ్చింది. రూ.147 రీఛార్జ్ ప్లాన్‌లో మార్పులు చేసింది, ఈ ప్లాన్ ప్రయోజనాలను కంపెనీ తగ్గించింది. మీరు బీఎస్ఎన్ఎల్ సిమ్ ఉపయోగిస్తుంటే.. రీఛార్జ్ చేసే ముందు, ఈ ప్లాన్‌లో ఏ మార్పులు జరిగాయో తెలుసుకోవడం చాలా అవసరం.

BSNL: సైలెంట్‌గా కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఆ రీఛార్జ్ ప్లాన్‌లో కీలక మార్పులు..
Krishna S
|

Updated on: Aug 03, 2025 | 11:47 PM

Share

కొంత కాలంగా BSNL సూపర్ ఆఫర్లతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. జియో, ఎయిర్‌టెల్ వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తుంది. గతేడాది ఆ కంపెనీలు రేట్లు పెంచడంతో చాలా మంది బీఎస్ఎన్‌ఎల్ వైపు మళ్లారు. దాంతో ఈ సంస్థ కస్టమర్ల సంఖ్య భారీగా పెరిగింది. అందుకు తగ్గట్లే ఆఫర్లు కూడా ప్రకటిస్తుంది. ఇటీవలే రూ.197 ప్లాన్‌లో మార్పులు చేసి కస్టమర్లకు షాక్ ఇచ్చిన బీఎస్ఎన్ఎల్.. ఇప్పుడు మరో ప్లాన్‌లోనూ అటువంటి మార్పులే చేసింది. రూ.147 చౌక ప్లాన్ ప్రయోజనాలను తగ్గించి కస్టమర్లకు మరో షాక్ ఇచ్చింది.రూ.147 ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

BSNL రూ.147 ప్లాన్ మార్పులు ఇవే..

రూ.147 బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌తో.. మీరు ఇప్పుడు 10 GB హై స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్ ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్లాన్ 25 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే.. మీరు ఈ ప్లాన్‌తో SMS ప్రయోజనాన్ని పొందలేరు. డేటా పరిమితి పూర్తయిన తర్వాత 40Kbpsకి తగ్గించబడుతుంది.

పాత ప్రయోజనాలు:

గతంలో రూ.147 ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో ఉండేది. డేటా, కాలింగ్ ప్రయోజనాలలో ఎటువంటి మార్పు లేదు. కానీ వ్యాలిడిటీ 5 రోజులు తగ్గించింది.

పెరిగిన రోజువారీ ఖర్చు..

వ్యాలిడిటీ తగ్గింపుతో ఈ ప్లాన్ ఇప్పుడు ఖరీదైనదిగా మారింది. ఎందుకంటే ఇప్పుడు రోజువారీ ఖర్చు పెరిగింది. గతంలో 30 రోజుల వ్యాలిడిటీ రూ.147 ధరకు రోజువారీ ఖర్చు రూ.4.90గా ఉండేది. ఇప్పుడు 25 రోజుల వ్యాలిడిటీకి రూ.147 ధరకు.. ఈ ప్లాన్ యొక్క రోజువారీ ఖర్చు రూ.5.88కి పెరిగింది. అంటే ఈ ప్లాన్ యొక్క రోజువారీ ఖర్చు దాదాపు రూ.1 పెరిగింది. బీఎస్ఎన్ఎల్ యొక్క టారిఫ్‌లు ఇప్పటికీ అత్యంత పొదుపుగా ఉన్నాయి. కానీ జియో, ఎయిర్‌టెల్‌తో కంపెనీ పోటీ పడలేకపోతుంది. 4G రోల్అవుట్ పూర్తయిన తర్వాత 5Gకి అప్‌గ్రేడ్‌పై బీఎస్ఎన్ఎల్ ఫోకస్ పెట్టనుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..