AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flipkart Freedom Sale: ఫ్రీడమ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్‌.. ఆ ఫోన్‌లు మరీ ఇంత తక్కువకా!

మీ పాత ఫోన్ తో విసిగిపోయారా.. దానికి గుడ్‌బై చెప్పి కొత్త ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా.. అయితే ఇదే మీకు మంచి అవకాశం. మీ కోసం ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు ఫ్రీడమ్ సేల్ 2025 తీసుకొచ్చింది. ఈ సేల్‌లో ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులను ఉపయోగించి EMI కొనుగోళ్లపై 10% వరకు తగ్గింపు పొందవచ్చు.

Flipkart Freedom Sale: ఫ్రీడమ్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్‌.. ఆ ఫోన్‌లు మరీ ఇంత తక్కువకా!
Flipkart Mobiles
Anand T
|

Updated on: Aug 04, 2025 | 10:54 PM

Share

మీ పాత ఫోన్ తో విసిగిపోయారా.. దానికి గుడ్‌బై చెప్పి కొత్త ఫోన్‌ను కొనాలనుకుంటున్నారా.. అయితే ఇదే మీకు మంచి అవకాశం. ఎందుకు కంటే ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ వచ్చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్ట్‌ 1 నుండి 8 వరకు ఫ్రీడమ్ సేల్ జరుగుతోంది. ఈ సేల్‌ ప్రత్యేకత ఏమిటంటే, మీరు ఫ్రీడమ్ సేల్‌లో తాజా ఐఫోన్‌లు, శామ్‌సంగ్ గెలాక్సీ మోడల్‌లు, ఇతర ప్రీమియం ఫోన్‌లను అద్భుతమైన ధరలకు పొందవచ్చు.

ఐఫోన్ 16

ఫ్రీడమ్ సేల్ సందర్భంగా ఐఫోన్ సిరీస్‌లోని తాజా మోడల్ ఐఫోన్ 16 పై ఫ్లిప్‌కార్ట్ భారీగా తగ్గింది. ఈ ఫోన్ లాంచ్ అయినప్పుడు ధర రూ.79,900గా ఉండేది, కానీ ఇప్పుడు రూ.69,999కే అందుబాటులో ఉంది. వివిధ బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కలిపితే, ఫోన్‌ ధర రూ.62,499కి తగ్గుతుంది.

శామ్‌సాంగ్‌

ఈ సేల్‌ మనకు తక్కువ ధరకు వచ్చే మరో మంచి మొబైల్‌ Samsung Galaxy S24, Samsung ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Galaxy S24 ప్రస్తుతం గొప్ప ఆఫర్‌తో అందుబాటులో ఉన్నాయి. స్టార్టింగ్‌లో రూ. 74,999 ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్‌ను ఇప్పుడు 46,999 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌లో అద్భుతమైన ఏఐ ఫీచర్స్‌తో పాటు, అదిరిపోయే కెమెరా ఉంటుంది. మీరు ఎక్కువగా ఫోటోలు దిగే వారు అయితే ఇదొక మంచి ఎంపిక

నత్తింగ్ ఫోన్‌ 3A

ఈ సేల్‌ మనకు నథింగ్ బ్రాండ్ నుంచి ఒక కొత్త ఫోన్ అందుబాటులోకి వస్తుంది అదే నథింగ్ ఫోన్‌ 3A, ఇది కూడా ఉచిత అమ్మకంలో గొప్ప ఆఫర్‌ను కలిగి ఉంది. రూ. 28,149 కు లాంచ్ అయిన ఈ ఫోన్ ఇప్పుడు రూ. 24,999 కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 120Hz AMOLED డిస్‌ప్లే తోపాటు, స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్, 50MP కెమెరాను మీరు పొందవచ్చు.

ఇతర ఆఫర్లు

ఈ సేల్‌లో ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డులను ఉపయోగించి EMI లావాదేవీలపై 10% వరకు తక్షణ తగ్గింపు పొందవచ్చు, ఫ్లిప్‌కార్ట్ ప్లస్, VIP కస్టమర్లు సూపర్‌కాయిన్‌లను ఉపయోగించి అదనపు తగ్గింపులను పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, మీ పాత ఫోన్‌లకు ఉత్తమ ఎక్స్ఛేంజ్ విలువను పొందవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.