BSNL 4G: మీకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్యాన్సీ నంబర్‌ కావాలా? ఇలా ఆన్‌లైన్‌లో సెలెక్ట్‌ చేసుకోండి

ఇటీవల రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల ధరలు పెంచడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ప్రైవేట్‌ టెలికాం కంపెనీలన్ని టారీఫ్‌ ధరలు పెంచినా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) మాత్రం పెంచలేదు. దీంతో ఇతర టెలికాం కంపెనీల కస్టమర్లందరూ బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు..

BSNL 4G: మీకు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫ్యాన్సీ నంబర్‌ కావాలా? ఇలా ఆన్‌లైన్‌లో సెలెక్ట్‌ చేసుకోండి
Bsnl Sim Card
Follow us
Subhash Goud

|

Updated on: Aug 05, 2024 | 10:16 AM

ఇటీవల రిలయన్స్‌ జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాల ధరలు పెంచడంతో వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఈ ప్రైవేట్‌ టెలికాం కంపెనీలన్ని టారీఫ్‌ ధరలు పెంచినా ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) మాత్రం పెంచలేదు. దీంతో ఇతర టెలికాం కంపెనీల కస్టమర్లందరూ బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇప్పుడు తక్కువ ధరకే ప్లాన్లు అందిస్తుండడంతో చాలామంది ఈ నెట్‌వర్క్‌కు మారుతున్నారు. మరోవైపు బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపడుతోంది కేంద్రం. అంతేకాదు ఒకవైపు 4జీ నెర్క్‌ను మరింతగా విస్తరిస్తూనే 5జీ నెట్‌వర్క్‌ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. తమ నెట్‌వర్క్‌కు మారాలనుకొనేవారికి ఆన్‌లైన్‌లోనే సులువుగా నచ్చిన నంబర్‌ను ఎంపిక చేసుకొనే సదుపాయం కల్పిస్తోంది.

ఇది కూడా చదవండి: Anant Ambani: అనంత అంబానీ వేతనం ఎంతో తెలుసా? ఇషా వార్షిక ఆదాయం ఎంత? వీరి బాధ్యతలు ఏంటి?

ఆన్‌లైన్‌లో నంబర్‌ను ఎంపిక చేసుకోవడం ఎలా?

  • ముందుగా గూగుల్‌ సెర్చ్‌లో ‘BSNL Choose Your Mobile Number’ అని సెర్చ్‌ చేయండి.
  • అక్కడ కింద కనిపించే cymnపై క్లిక్‌ చేయండి.
  • ఆ తర్వాత మీ జోన్‌, రాష్ట్రాన్ని ఎంచుకోండి.
  • అందులో నచ్చిన నంబర్‌ కోసం వెతికేందుకు ఆప్షన్‌ను ఎంచుకోండి. search with series, start number, end number, sum of numbers’ అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి.
  • ఫ్యాన్సీ నంబర్‌ కోసం పక్కనే ఫ్యాన్సీ నంబర్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయండి.
  • వీటిలో ఒక ఆప్షన్‌ను ఎంచుకొని మీకు నచ్చిన అంకెలను ఎంటర్ చేసి ‘search’పై క్లిక్‌ చేయాలి.
  • మీరు ఎంటర్‌ చేసిన నంబర్‌ ఆధారంగా కొన్ని ఫోన్‌ నంబర్లను కనిపిస్తాయి.
  • అందులో మీకు నచ్చిన నంబర్‌ను ఎంచుకున్న తర్వాత రిజర్వ్‌ చేసుకునేందుకు Reserve Numberపై క్లిక్‌ చేయండి
  • అయితే ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న నంబర్‌ను నమోదు చేయగానే మీకు ఓ ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్‌ చేయాలి. దీంతో ఆ నంబర్‌ మీకు రిజర్వ్‌ అవుతుంది.
  • తర్వాత మీ దగ్గరలో ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయానికి వెళ్లి సిమ్‌ కార్డు తీసుకోవచ్చు.

ఇలా చేయడం వల్ల మీకు నచ్చిన BSNL సిమ్ కార్డును తీసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌లో రూ.18 నుంచి రీఛార్జ్‌ ప్లాన్స్‌.. ప్రయోజనాలు అదుర్స్‌