Viral Message: ముక్కుకు కొబ్బరి నూనె రాస్తే కోవిడ్ రాదు.. ఫార్మా కంపెనీ చైర్‌పర్సన్ పేరుతో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారం

Viral Message: COVID 19 కి సంబంధించిన చాలా సందేశాలు ఈ రోజుల్లో వైరల్ అవుతున్నాయి, అయితే దీని నిజం తెలుసుకుంటే మీరు కూడా షాక్ అవుతారు.

Viral Message: ముక్కుకు కొబ్బరి నూనె రాస్తే కోవిడ్ రాదు.. ఫార్మా కంపెనీ చైర్‌పర్సన్ పేరుతో వైరల్ అవుతున్న తప్పుడు సమాచారం
BIocon Chief Kiran Majumdar
Follow us
Sanjay Kasula

|

Updated on: May 17, 2021 | 5:48 PM

సోషల్ మీడియాలో ఓ మెసేజ్ వైరల్ అవుతోంది. ప్రముఖ ఫార్మా కంపెనీ బయోకాన్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ మజుందార్ షా పేరుతో ఇది వైరల్ అవుతోంది. కోవిడ్ మహమ్మారి నుంచి తనను తాను రక్షించుకునేందుకు ముక్కుకు కొబ్బరి నూనెను రోజుకు నాలుగు సార్లు రాసుకుంటున్నట్లుగా అందులో ఉంది. ఈ మెసేజ్‌ ఓ వాట్సాప్ లింక్ నుంచి లింక్డ్ఇన్‌తోపాటు ఇతర సోషల్ మీడియాల్లో షేర్ అవుతోంది.

అయితే వైరల్ అవుతున్న మెసేజ్ పై బయోకాన్ కెంపెనీ స్పందించింది. ఇది పూర్తిగా తప్పుడు సందేశం అంటూ పేర్కొంది. “#FakeForwardAlert: కిరణ్ మజుందార్ షా పేరిట ఒక నకిలీ సందేశం వాట్సాప్‌లో పోస్ట్ చేయబడుతోంది, అందులో తప్పుడు సమాచం ఉందని తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొంది. ఇది నకిలీ సందేశం మాత్రమే కాకుండా కిరణ్ ఎక్కడా అంటి విషయాన్ని చెప్పలేదు. దయచేసి దీనిని వారి సలహాగా పరిగణించవద్దు. #StaySafe” అంటూ పేర్కొంది.

కరోనాకు సంబంధించిన అనేక సందేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో కరోనాను నివారించడానికి కొన్ని చిట్కాలు ప్రచారం చేస్తున్నారు. ఇటీవలి వైరల్ సందేశంలో, వర్షం కారణంగా కరోనా ఆగిపోతుందని పేర్కొన్నారు. కాని అందులో నిజం లేదు. పిఐబి ఫాక్ట్ చెక్ బృందం కూడా దీని గురించి ట్వీట్ చేసింది. కరోనాను అడ్డు కోవాలంటే కేవలం మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడంతోపాటు సామాజిక దూరాన్ని పాటించడంతోనే ఈ మహమ్మారి నుంచి మనను మనం రక్షించుకోవచ్చని పేర్కొంది.

ఇవి కూడా చదవండి: పసుపు పాలతో తాగితే బరువు తగ్గుతారా ? వెయిట్ లాస్ మాత్రమే కాకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలు ఇవే..

Cyclone Tauktae Live: గుజరాత్ దిశగా ‘తౌటే’ తుఫాన్.. రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. రాత్రి తీరం దాటే అవకాశం

Viral: ఏటీఎంలో డబ్బును ఇలా కూడా డ్రా చేయొచ్చా.. యువతి చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వైరల్ వీడియో..