Mutual funds: పెట్టుబడికి పెద్ద భరోసా.. ఆ పథకంతో బోలెడు ప్రయోజనాలు
మ్యుచువల్ ఫండ్స్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. గతంలో బ్యాంకులు, పోస్టాఫీసులలో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు వాటితో పాటు మ్యుచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ చేసే సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అందరికీ తెలిసిందే.
మ్యుచువల్ ఫండ్స్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. గతంలో బ్యాంకులు, పోస్టాఫీసులలో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయడానికి ప్రజలు ఆసక్తి చూపేవారు. ఇప్పుడు వాటితో పాటు మ్యుచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్నారు. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ చేసే సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అందరికీ తెలిసిందే. అలాగే మన పెట్టుబడికి నష్టం లేకుండా ప్రతి నెలా నగదును ఉపసంహరించుకునే అవకాశం ఉన్న సిస్టమేటిక్ విత్ డ్రావెల్ ప్లాన్ (ఎస్ డబ్ల్యూపీ) కూడా అమల్లో ఉంది. ఉద్యోగ విరమణ తర్వాత ప్రతి నెలా నిర్ణీత ఆదాయం కోరుకునే వారికి చాలా ఉపయోగంగా ఉంటుంది.
నెలవారీ ఆదాయం
పదవీ విరమణ సమయంలో నెలవారీ ఆదాయం కావాలనుకునేవారికి ఎస్ డబ్ల్యూపీలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. క్రమబద్ధమైన ఉపసంహరణ ప్రణాళికతో పొదుపు నుంచి స్థిరమైన నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు. ఫిక్స్‌డ్ డిపాజిట్లు, యాన్యుటీ ప్లాన్లకు పరిమితులు ఉంటాయి. అయితే ఎస్ డబ్ల్యూపీలు రిటర్న్‌మెంట్ ఆదాయాన్ని నిర్వహించడానికి అనువైన, విధానాలను చూపుతాయి. రిటర్న్‌లు, రిస్క్, నెలవారీ ఆదాయ అవసరాలపై ఆధారపడి మీ పెట్టుబడులను సర్దుబాటు చేసుకునే సౌలభ్యం కలుగుతుంది.
ఎస్ డబ్ల్యూపీ వల్ల ప్రయోజనాలు
- స్థిర ఆదాయం కోసం ఎస్ డబ్ల్యూపీ అత్యంత వీలైన మార్గం. వివిధ విధానాలలో (నెలవారీ, త్రైమాసిక) నిర్ణీత మొత్తంలో డబ్బును ఉపసంహరించుకోవడానికి వీలుంటుంది. మీ జీవన వ్యయాలకు ఆదాయం అవసరమయ్యే విశ్రాంత ఉద్యోగులు ప్రయోజనం చేకూరుతుంది.
- పెన్షన్ మాదిరిగానే ఎస్ డబ్ల్యూపీ కూడా మీకు ఆదాయం విషయంలో మనశ్సాంతిని కలిగిస్తుంది. ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది,
- పదవీ విరమణ సమయంలో కూడా ఆర్థిక క్రమశిక్షణకు దోహదపడుతుంది. అవసరమైన దానికంటే ఎక్కువ ఉపసంహరించుకోకుండా ఉండేలా చూస్తుంది, మీ ఆర్థిక వ్యవహారాలను మెరుగ్గా నిర్వహించడంలో మీకు సహాయం చేస్తుంది.
- ఎస్ డబ్ల్యూపీలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ మూలధనాన్ని నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇవి మీకు ఆదాయాన్ని అందిస్తూనే మీ మూలధనాన్ని సంరక్షిస్తుంది. మీ పెట్టుబడిలో కొంత భాగాన్ని మాత్రమే ఉపసంహరించుకుంటున్నందున, మిగిలిన మొత్తం వృద్ధి చెందుతూనే ఉంటుంది.
- ప్రతి సంవత్సరం ఆదాయం పెరిగేలా సరైన ఉపసంహరణ రేటును నిర్ణయించుకోవాలి. ఆ సమయంలో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడిపై మితమైన రాబడిని అంచనా వేయడం చాలా అవసరం.
- మీరు సురక్షితమైన పెట్టుబడి కోసం వెళ్లి 6 శాతంవార్షిక రాబడిని పొందుతున్నారనుకోండి. మీకు పదవీ విరమణ సమయంలో నెలవారీ రూ. 25 వేలు రావాలంటే రూ. 70 లక్షల కార్పస్ అవసరం. ఇది ప్రతి సంవత్సరం 3 శాతం చొప్పున పెరుగుతుంది. 8 శాతం వార్షిక రాబడితో రూ. 51 లక్షలు, 10 శాతం వార్షిక రాబడిపై రూ. 41 లక్షలు, 12 శాతం వార్షిక రాబడిపై రూ. 34 లక్షలు అవసరమవుతాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..